కాకరకాయ జ్యూస్ తో లాభాలెన్నో ..?
విజిటబుల్స్ లో చాలా మంది తినకూడదు..వాటివైపు చూడకూడదు అని ఫిక్స్ అయ్యేది కాకరకాయ..వంకాయ.. అయితే కాకరకాయ జ్యూస్ తాగడం వల్ల అనేక లాభాలు ఉన్నాయి అంటున్నారు వైద్య నిపుణులు..
సహజంగానే కాకరకాయలో విటమిన్లు,మినరల్స్ అధికంగా ఉంటాయి..ఖాళీ కడుపుతో కాకరకాయ జ్యూస్ తాగితే చాలా లాభాలు ఉన్నాయంటున్నారు వైద్యులు..కాకరకాయలో పోషకాలు అధికంగా ఉండటం వల్ల ఇవి శరీరాన్ని ..ఆరోగ్యాన్ని కాపాడుతాయి..
మధుమేహాన్ని నియంత్రణలో ఉంచడమే కాకుండా జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది..రోగనిరోధక శక్తిని పెంచడమే కాకుండా కాలేయ పనితనాన్ని మెరుగుపరుస్తుంది..చర్మం లోపల నుండి సంరక్షణ లభించడమే కాకుండా చర్మం అందంగా మారుతుంది..
బరువు తగ్గడంలో కూడా కాకరకాయ జ్యూస్ చాలా ఉపయోగపడుతుంది..కాకరకాయలో ఉండే అరుదైన పోషకాలు మహిళల్లో బ్రెస్ట్ క్యాన్సర్ రాకుండా ఉండటంలో సాయపడతాయి అని వైద్యనిపుణులు అంటున్నారు..