కేంద్ర మంత్రి బూట్లు తీసి మరి …?

Satish Chandra Dubey Member of Rajya Sabha
జార్ఖండ్ లో కేంద్ర మంత్రి సతీష్ చంద్ర దూబే పర్యటన వివాదంగా మారింది. ధన్‌బాద్ పర్యటనలో కోల్ ఇండియా అనుబంధ సంస్థ అయిన భారత్ కోకింగ్ కోల్ లిమిటెడ్ (బీసీసీఎల్) జనరల్ మేనేజర్ అరిందం ముస్తాఫీ మంత్రి బూట్లను తీయడం, ఆయన పైజామా బొందును సరిచేయడంపై తీవ్ర విమర్శలు వస్తున్నాయి.
ధన్‌బాద్‌కు విచ్చేసిన కేంద్ర బొగ్గు శాఖ సహాయ మంత్రి సోఫాలో రిలాక్స్ అయి ఉండగా, ఆయన బూట్లను జీఎం తొలగించడమే కాక, వాటిని అధికారులకు అప్పగించిన దృశ్యాలు వీడియోలో రికార్డయ్యాయి.
కాగా, ఇది చాలా అవమానకరమని కాంగ్రెస్ వ్యాఖ్యానించింది. తమ అవినీతి పనులను కప్పిపుచ్చడానికే బీసీసీఎల్ అధికారులు ఇలాంటి దిగజారుడు చర్యలకు పాల్పడుతున్నారని విమర్శించింది.