వైసీపీలోకి ఉండవల్లి అరుణ్ కుమార్ – క్లారిటీ..!

ఏపీపీసీసీ మాజీ అధ్యక్షులు.. మాజీ మంత్రి శైలజా నాథ్ ఇటీవల మాజీ ముఖ్యమంత్రి.. వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహాన్ రెడ్డి ఆధ్వర్యంలో ఆ పార్టీ కండువా కప్పుకున్న సంగతి తెల్సిందే. దీనికి ముందు వైసీపీ శ్రేణులతో సమావేశమైన జగన్ త్వరలో జగనన్న2.0 చూస్తారు. పార్టీలో ప్రతి ఒక్కర్ని కాపాడుకుంటాను. భవిష్యత్తులో అధికారం మనదే.
ఎవర్ని వదిలిపెట్టను అని భరోసానిచ్చిన సంగతి తెల్సిందే. ఆ వ్యాఖ్యల తర్వాత కాంగ్రెస్ పీసీసీ మాజీ చీఫ్ అయిన శైలజా నాథ్ వైసీపీ గూటికి చేరారు. దీంతో కాంగ్రెస్ కు చెందిన పలువురు వైసీపీలో చేరతారని వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. మాజీ ఎంపీ.. సీనియర్ కాంగ్రెస్ నాయకులు.. దివంగత మాజీ సీఎం వైఎస్సార్ ముఖ్య అనుచరుడైన ఉండవల్లి అరుణ్ కుమార్ వైసీపీలో చేరనున్నట్లు వార్తలు చక్కర్లు కొట్టాయి.
ఈ వార్తలపై ఇటు అరుణ్ కుమార్ అనుచరులు.. అటు వైసీపీ శ్రేణుల దగ్గర వాకబ్ చేయగా ఇప్పట్లో అయితే అలాంటి సమాచారం ఏది మాదగ్గర లేదు. మున్ముందు చెప్పలేము అని చెప్పడం విశేషం. ఎందుకంటే ఇటు వైఎస్సార్ అటు జగన్ అంటే ఉండవల్లికి పాజిటీవ్ కోణం ఉండటంతో చేరిన ఆశ్చర్యం లేదని రాజకీయ విశ్లేషకులు వ్యాఖ్యానిస్తున్నారు. చూడాలి మరి ఉండవల్లి ఉదరంలో ఏముందో..!
