ఎమ్మెల్సీ కవిత బెయిల్ పిటిషన్ పై ట్విస్ట్

ఢిల్లీ లిక్కర్ స్కాంలో అరెస్టై జైల్లో ఉన్న బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత వేసిన బెయిల్ ఫిటిషన్ పై విచారణను మరోవారం రోజుల పాటు వాయిదా వేసింది సుప్రీం కోర్టు. ఈడీ,సీబీఐ విచారణ సంస్థలకు నోటీసులు జారీ చేస్తూ వివరణను కోరింది. ఈ పిటిషన్ విచారణను ఈ నెల ఇరవై తారీఖుకు వాయిదా వేసింది.
దీంతో ఎమ్మెల్సీ కవితకు సుప్రీం కోర్టు మధ్యంతర బెయిల్ ఇచ్చేందుకు నిరాకరించింది. ఈ కేసుపై జస్టిస్ బీఆర్ గవాయి, జస్టిస్ విశ్వనాథ్ ధర్మాసనం ఈరోజు సోమవారం విచారణ జరిపింది.సీబీఐ, ఈడీ కేసులలో బెయిల్ ఇవ్వాలని కవిత పిటిషన్ దాఖలు చేసిన విషయం తెలిసిందే.
ఈ నేపథ్యంలో ఢిల్లీ హైకోర్టు తీర్పును కవిత సవాల్ చేశారు. మార్చి 15న కవితను ఈడీ అరెస్టు చేయగా.. ఏప్రిల్ 11న సీబీఐ అరెస్ట్ చేసింది. మరోవైపు కవిత తరుఫున న్యాయవాది ముకుల్ రోహత్గి వాదనలు వినిపించారు.
