త్రిషకు తెలంగాణ సర్కారు భారీ నజరానా..!

టీమిండియా అండర్ 19 మహిళల వరల్డ్ కప్ లో గెలవడానికి ప్రధాన పాత్ర పోషించిన తెలంగాణ రాష్ట్రంలోని ఉమ్మడి ఖమ్మం జిల్లా భద్రాచలానికి చెందిన క్రికెటర్ గొంగడి త్రిష ఈరోజు హైదరాబాద్ మహానగరంలోని జూబ్లీహిల్స్ నివాసంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని మర్యాద పూర్వకంగా కలిశారు.
ఈ సందర్భంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అండర్-19 ప్రపంచ కప్ లో అద్భుతంగా రాణించిన త్రిషను అభినందించారు. అంతేకాకుండా ఆమెకు ప్రభుత్వం తరపున కోటి రూపాయల నజరానా ప్రకటించారు. మరోవైపు వరల్డ్ కప్ టీం మెంబర్, తెలంగాణకు చెందిన ధృతి కేసరికి రూ. 10 లక్షల నజరానాను ప్రకటించారు.
అండర్-19 వరల్డ్ కప్ టీం హెడ్ కోచ్ నౌషీన్, ట్రైనర్ షాలినికి పది లక్షల చొప్పున నజరానాను అందజేయనున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి, ప్రభుత్వ సలహాదారు వేం నరేందర్ రెడ్డి, శాట్స్ చైర్మన్ శివసేనా రెడ్డి, సీఎం సెక్రటరీ షానవాజ్ ఖాసీం, తదితరులు పాల్గోన్నారు.
