పలువురు ఐపీఎస్‌లు బదిలీ

IPS Transfers
తెలంగాణలో పలువురు ఐపీఎస్‌ల బదిలీలు జరిగాయి.. హైదరాబాద్ సీపీగా సీవీ ఆనంద్ నియామకమయ్యారు. ఇయనకు ముందు సందీప్ శాండిల్య, కొత్తకోట శ్రీనివాస్ బాధ్యతలు నిర్వహించారు… హైదరాబాద్ సీపీగా ఉన్న ఐపీఎస్ కొత్తకోట శ్రీనివాస్‌రెడ్డి మరోసారి బదిలీ అయ్యారు..
ఏసీబీ డీజీగా విజయ్‌కుమార్.. విజిలెన్స్ అండ్ ఎన్‌ఫోర్స్‌మెంట్ డీజీగా కొత్తకోట శ్రీనివాస్ రెడ్డి.. పోలీస్ పర్సనల్ అడిషనల్ డీజీగా మహేష్ భగవత్‌కు అదనపు బాధ్యతలు ప్రభుత్వం అప్పజెప్పింది.
మరోవైపు సీవీ ఆనంద్ 2021 డిసెంబర్ 25 నుండి 2023 అక్టోబర్ 11వరకు సీపీగా సేవలు అందించారు. ఆ తర్వాత జరిగిన ఎన్నికల్లో ఈసీ ఆదేశాలతో ఆనంద్ ఏసీబీ డైరెక్టర్ గా బాధ్యతలు తీసుకున్నారు. తాజాగా మరోకసారి నగర సీపీగా బాధ్యతలు తీసుకోనున్నారు.
