ఎమ్మెల్యే.. ఎమ్మెల్సీ ..మంత్రులకు టీపీసీసీ క్లాస్..?

 ఎమ్మెల్యే.. ఎమ్మెల్సీ ..మంత్రులకు టీపీసీసీ క్లాస్..?

TPCC chief says 90-100 seats are certain..!

Loading

తెలంగాణ అధికార కాంగ్రెస్ పార్టీకి చెందిన ఎమ్మెల్యే.. ఎమ్మెల్సీ.. మంత్రులకు టీపీసీసీ చీఫ్ .. ఎమ్మెల్సీ బొమ్మ మహేష్ కుమార్ గౌడ్ క్లాస్ పీకినట్లు గాంధీ భవన్ వర్గాలు కోడై కూస్తున్నాయి. ఇటీవల మంత్రి కొండా సురేఖ అక్కినేని కుటుంబం.. సమంత గురించి చేసిన వ్యాఖ్యలు వివాదస్పదం అయ్యాయి.. అక్కడితో ఆగకుండా మొత్తం సినీ ఇండస్ట్రీనే ఏకతాటిపైకి వచ్చి ముక్తకంఠంతో ఖండించే పరిస్థితి ఏర్పడింది. ఏకంగా అక్కినేని అమల తో ప్రియాంక గాంధీ ఫోన్ కాల్ మాట్లాడటం. త్వరలోనే మంత్రి కొండా సురేఖపై చర్యలు తీసుకుంటామని హామీచ్చేంతవరకు పరిస్థితులు చేజారిపోయాయి.మరో వైపు అక్కినేని నాగార్జున కొండా సురేఖ పై వందకోట్లకు పరువు నష్ట దావా వేశారు. ఈ పిటిషన్ పై కోర్టు ఈ రోజు మంగళవారం విచారించనున్నది కూడా.. దీంతో టీపీసీసీ చీఫ్ అయిన మహేష్ కుమార్ గౌడ్ మీడియా సమావేశంలో .. మీడియా ముందు మాట్లాడేటప్పుడు ఒల్లు నోరు దగ్గర పెట్టుకోవాలని సూచించినట్లు గాంధీ భవన్ వర్గాలు తెలిపాయి. అంతేకాకుండా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి కూడా ఇవే సూచనలు సలహాలు ఇవ్వాలని కొంతమంది ఎమ్మెల్యేలు.. మంత్రులు టీపీసీసీ చీఫ్ ను కోరారట.దీంతో తనకున్న చనువుతో సీఎం కు సైతం ఇలాంటి సలహాలు.. సూచనలు ఇస్తానని హామీచ్చినట్లు సమాచారం..

Related post

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *