ప్రతి మూవీకి 2నుండి 4కోట్లు రెమ్యునరేషన్ పెంచుతున్న అగ్ర హీరో
తెలుగు సినిమా ప్రొడక్షన్ వాల్యూ ప్రతి మూవీకి పదింతలు పెరుగుతుందని దర్శక నిర్మాతలు వాపోతున్న సంఘటనలు మనమెన్నో చూస్తుంటాము. చిన్న పాత్రలో నటించే నటుడు దగ్గర నుండి హీరో వరకు తమ రెమ్యూనేషన్ పెంచేయడంతోనే నిర్మాతలు సినిమాపై భారీ ఖర్చు పెడుతున్నారని కూడా వాళ్ల ఆవేదన.. ఓ సినిమా హిట్ అయితే చాలు తర్వాత సినిమాకు కోట్లలో రెమ్యూనేషన్ తీసుకుంటున్నారు .
తాజాగా ఈ అంశం గురించే ఆహా అన్ స్టాపబుల్ షో లో వచ్చింది. సీనియర్ స్టార్ అగ్రహీరో నందమూరి బాలకృష్ణ హోస్ట్ గా ఆన్ లైన్ డిజిటల్ ఫ్లాట్ ఫామ్ ఆహాలో ప్రసారమై ఈ షోకి దర్శకుడు వెంకీ అట్లూరి, నిర్మాతలు నాగవంశీ,దిల్ రాజ్ హజరయ్యారు. ఈ షోలో బాలకృష్ణ సినిమా సినిమాకు రేటు పెంచే హీరో అని అడుగుతాడు.
దీనికి సమాధానంగా నాగవంశీ మీరు చెప్పగలరు. కానీ తెల్సిన మేము చెప్పలేము అని స్పాంటనివ్ గా రిప్లయ్ ఇస్తాడు. అయితే సినిమా సినిమాకు రెండు నుండి నాలుగు కోట్ల వరకు రెమ్యునరేషన్ పెంచుకుంటూ పోతారని బాలయ్య బాబుపై ఇండస్ట్రీలో టాక్ నడుస్తుంది. బహుషా నాగవంశీ అన్నది బాలయ్య బాబును ఉద్ధేశించి ఏమో మరి..!