రేపు సోమవారం విద్యాసంస్థలకు సెలవు
తెలంగాణలో గత రెండు రోజులుగా కురుస్తోన్న భారీ వర్షాల నేపథ్యంలో రేపు సోమవారం రాష్ట్ర వ్యాప్తంగా అన్ని విద్యాసంస్థలకు సెలవు మంజూరు చేస్తున్నట్లు ప్రభుత్వం ఆదేశాలను జారీ చేసింది..
వర్షాలు.. వరదల నేపథ్యంలో స్కూళ్లలో విద్యార్థులకు ఎదురై సమస్యలను దృష్టిలో పెట్టుకుని ఈ నిర్ణయం తీసుకున్నట్లు పేర్కొన్నది..
ఈ నిర్ణయాన్ని తూచ తప్పకుండా అన్ని ప్రైవేట్ ప్రభుత్వ విద్యాసంస్థలు పాటించాలని ఆదేశించింది.మరోవైపు అన్ని ప్రభుత్వ విభాగాల ఉద్యోగులకు రేపు సెలవులు రద్ధు చేసింది.