గాయం చూసిన వాళ్లు మరిచిపోతారు కానీ గాయపడిన వాళ్లు కాదు.

Anumula Revanth Reddy
ఇటీవల కురిసిన భారీ వర్షాలతో వచ్చిన వరదలతో ఇటు తెలంగాణలోని ఖమ్మం, మహబూబాబాద్, అటు ఏపీలోని విజయవాడ ,కృష్ణా జిల్లాలు భారీ నష్టాన్ని చవి చూసిన సంగతి తెల్సిందే. ఖమ్మంలో అయితే మున్నేరు వాగు పొంగిపొర్లితే జెడ్పీ సెంటర్ సైతం మునిగిందంటేనే వరదలు ఏ స్థాయిలో వచ్చాయో ఆర్ధమవుతుంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో సహా జిల్లాకు చెందిన ముగ్గురు మంత్రులు పొంగులేటి, తుమ్మల,డిప్యూటీ సీఎం భట్టీ ఖమ్మం అంతటా కాళ్లకు బలపం కట్టుకుని తిరుగుతూ బాధితులను పరామర్శిస్తూ వరద బాధితులకు ఒక్కొక్క కుటుంబానికి ముందస్తు సాయంగా పది వేలు ఇస్తాం.. ఆవు, గేదెలు మరణిస్తే రూ.50వేలు, గొర్రె, మేకలకు రూ.5వేలు ఇస్తామన్నారు.
ఇళ్లకు నష్టం జరిగితే పీఎం ఆవాస్ యోజనకింద ఆర్థికసాయం చేస్తామని ప్రకటించేశారు. ఈ ప్రకటన ఇచ్చి రెండు నెలలవుతున్న కానీ పది హేను పైసల సాయం కూడా ఒక్క కుటుంబానికి అందలేదని వరద బాధితులు వాపోతున్నారు. ఇదే అంశం గురించి ఇటీవల బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్.. మాజీ మంత్రి కేటీఆర్ మాట్లాడుతూ హైదరాబాద్ లో వరదలోస్తే ఇల్లు వదిలిపెట్టకుండా ప్రతి ఇంటికి పదివేల చొప్పున సుమారు ఆరు వందల యాబై కోట్లకు పైగా రూపాయలను వరద సాయం అందించిన ఘనత బీఆర్ఎస్ ది..
హామీచ్చిన రెండు నెలలవుతున్న పదిహేను పైసలు కూడా ఇవ్వని నీచమైన చరిత్ర కాంగ్రెస్ ది ఆయన ఆరోపించారు. మాజీ మంత్రి కేటీఆర్ ఆరోపించినట్లుగా ఖమ్మం వరద బాధితులకు పైసా సాయం అందలేదంట. గాయం చేసిన వాళ్లు మరిచిపోతారు కానీ గాయపడిన వాళ్లు మరిచిపోరు కదా.. అంటే వరదల వల్ల నష్టపోయిన వాళ్లు తమ బాధను ఎప్పటికి మరిచిపోరు. ఆ ప్రభావం ఎప్పటికైన కన్పిస్తుందని రాజకీయ వర్గాలు చెబుతున్నాయి..ఇప్పటికైన ప్రభుత్వం వరద బాధితులకు సాయం అందించాలని వాళ్ళు డిమాండ్ చేస్తున్నారు.
