తెలంగాణలో ఆ రెండు రోజులు సెలవు

CM Revanth Reddy
తెలంగాణ లో ఈ నెల ఏడో తారీఖున , పదిహేడో తారీఖున సెలవు దినాలుగా రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది.దీనికి సంబంధించిన ఉత్తర్వులను ప్రభుత్వం జారీ చేసింది..
ఈ నెల ఏడో తారీఖున వినాయకచవితి, పదిహేడో తారీఖున మిలాద్ ఉన్ నబీ సందర్భంగా ఈ నిర్ణయం తీసుకుంది. హాలీడే క్యాలెండర్ ప్రకారం పదహారు తారీఖున మిలాద్ ఉన్ నబి కి సర్కారు సెలవు ఇచ్చింది.
కానీ నెలవంక దర్శనం తేదిని బట్టి దాన్ని పదిహేడో తారీకుకు మార్చినట్లు తెలిపింది. అదే రోజు హైదరాబాద్ లో గణేశ్ నిమజ్జనం జరగనున్నది. దీంతో ఆ రెండు కార్యక్రమాల కోసం సెలవు ఇచ్చినట్లు ప్రభుత్వం తెలిపింది.
