రేవంత్ పోస్టుకి ఆ4గురు మంత్రులు ఎసరు.!

If you don’t listen, you will be suspended – Revanth warning!
ఢిల్లీ పర్యటనలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నిర్వహించిన మీడియా చిట్ చాట్ లో మాట్లాడుతూ నాపక్కనున్నవాళ్లే నా పని నన్ను చేసుకోనీవ్వడం లేదు. ఎంతసేపు వాళ్లకు నాకుర్చీపైనే ఆశ. నేను ఎవర్ని పట్టించుకోను. రాహుల్ గాంధీ అప్పజెప్పిన బాధ్యతను ఎంత కష్టమైన నెరవేరుస్తాను . కులగణన అనేది రాహుల్ గాంధీ డ్రీమ్ ప్రాజెక్టు. ఎవరెన్ని కుట్రలు చేసిన. కుతంత్రాలు పన్నిన దాన్ని వందకు వందశాతం పూర్తి చేస్తాను. బీసీలకు న్యాయం చేస్తానని అన్నారు. అయితే మరి సీఎం రేవంత్ రెడ్డికి అడ్డుపడుతున్న ఆ మంత్రులు ఎవరూ..?. ఎందుకు సీఎం కుర్చీపై ఆశపడుతున్నారు ..? అని ప్రశ్నలు వెలువడుతున్నాయి.
పార్టీ అధికారంలోకి వచ్చిన మొదట్లో ఓ మంత్రి మాట్లాడుతూ ఇటు పార్టీలో.. అటు ప్రభుత్వంలో నేనే నంబర్ టూ . నేను చెప్పినట్లే నడవాలి. సీఎం తర్వాత సీఎం ను నేనే అన్నట్లు సదరు మంత్రి వ్యవహారించారు. అంతేకాదు ఏకంగా జిల్లాల వారీగా పర్యటనలు చేశారు. ఆయా జిల్లాలకు చెందిన నేతలతో..కార్యకర్తలతో మాట్లాడటం.. మీకు పదవులైన.. పనులైన నేను చెబితేనే అవుతాయనే స్థాయిలో వ్యవహారించడం జరిగింది. తాజాగా సదరు మంత్రిపై ముందునుండి ఉన్న కాంగ్రెస్ నేతలు.. ఎమ్మెల్యేలు.. మంత్రులతో సహా తీవ్ర అసంతృప్తితో ఉండటమే కాకుండా ఆ మంత్రి ఆగడాలు. అక్రమాలు.. అవినీతిపై ఏకంగా పార్టీ జాతీయ అధ్యక్షుడు మల్లిఖార్జున ఖర్గెకి ఓ పెద్ద ఫైలే అందించారు.
ఆ తర్వాత ఉమ్మడి నల్గోండ జిల్లాకు చెందిన ఓ సీనియర్ మంత్రి సైతం తనకే సీఎం పదవి వస్తుంది. అందరూ సన్నద్ధమవ్వాలి. ఉగాది పండుక్కి ఈ మార్పు ఉండోచ్చు అని తన అనుచరులకు లీకులు సైతం ఇచ్చాడు. అక్కడితో ఆగకుండా తనకు మద్ధతు కూడబెట్టుకోవడం కోసం ప్రస్తుతం సీఎం స్నేహితుడైన. పక్క రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు ను సైతం తన ఫ్యామిలీతో కలిశారు. మరోవైపు అదే జిల్లాకు చెందిన ఇంకో మంత్రి తనకేమి తక్కువ.. నేను ఎస్పీ స్థాయి అధికారిని. నాకంటే కింది స్థాయిన హోమ్ గార్డు కింద పనిచేయాల్నా.
నాకే ఇవ్వాలని ఇటు గల్లీలో అటు ఢిల్లీలో పెద్దఎత్తున పైరవీలు నడిపారు. చివరికీ తన సోదరుడికి మంత్రి పదవో.. క్యాబినెట్ ర్యాంకు హోదా ఇస్తామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హామీవ్వడంతో కొన్ని రోజుల నుండి మౌనంగా ఉన్నారు. మరోవైపు కరీంనగర్ జిల్లాకు చెందిన మంత్రులు సైతం ఈ కుర్చీపై ఆశపడటంతో తట్టుకోలేక రేవంత్ రెడ్డి ఢిల్లీలో అలా మాట్లాడారని గాంధీ భవన్.. రాజకీయ వర్గాలు చర్చించుకుంటున్నాయి.
