ప్రజాపాలనలో అక్రమ అరెస్టులకు పరాకాష్ట ఇది..!

Attack on BRS activist
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గత సార్వత్రిక ఎన్నికల ప్రచారంలో ఆరు గ్యారంటీలతో పాటు నాలుగోందల ఇరవై హామీలతో పాటు చెప్పిన మాట ఇందిరమ్మ రాజ్యం తెస్తాము.. ప్రజాపాలనను తెస్తాము అని. హామీల అమలు సంగతి పక్కనెడితే ప్రభుత్వాన్ని ప్రశ్నించినవాళ్లను.. హామీలను అమలు చేయమని అడిగినవాళ్లను అక్రమ కేసులు పెట్టి అరెస్టులు చేస్తుంది కాంగ్రెస్ ప్రభుత్వం. ఇలా అరెస్టైనవాళ్లు న్యాయస్థానాలకు వెళ్లడం. అక్కడ తమ గోడును వెల్లబుచ్చుకోవడం.. న్యాయస్థానాలు ప్రభుత్వంపై మొట్టికాయలు వేసి వాళ్లకు బెయిల్ ఇవ్వడం జరుగుతుంది.
తాజాగా ఇటీవల ప్రభుత్వాన్ని దర్శనం వెంకటయ్య అనే 77 ఏళ్ల దళిత వృద్ధుడిని తెలంగాణ సీసీఎస్ పోలీసులు అరెస్ట్ చేశారని సోషల్ మీడియాలో వార్తలు చక్కర్లు కొడుతున్నాయి . ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పాలనను విమర్శిస్తూ పరుషమైన పదాలు వాడినందుకు అరెస్ట్ చేసినట్లు తెలుస్తుంది. వెంకటయ్య స్వగ్రామం చిన్న ముప్పారం, ఇనుగుర్తి మండలం, మహబూబాబాద్ జిల్లాకి చెందిన నివాసి.
ఈ రోజు మధ్యాహ్నం మఫ్టీలో ఉన్న పోలీసులు వెంకటయ్య ఇంటి మీద దాడి చేసి ఎత్తుకెళ్లారు అని సమాచా రం . అనారోగ్యంతో ఉన్నాడని చెప్పినా వినిపించుకోని పోలీసులు. కుటుంబ సభ్యులకు ఏ సమాచార మూ ఇవ్వని పోలీసులు. ఆందోళనలో కుటుంబ సభ్యులు ఉన్నారు. ప్రభుత్వాన్ని విమర్శించి నందుకే ఒక దళిత వృద్ధుడిని అరెస్ట్ చేసిన రేవంత్ రెడ్డి ప్రభుత్వం.వెంకటయ్య మాట్లాడిన వీడియో ప్రసారం చేసినందుకే గత వారం జర్నలిస్టులైన రేవతి, తన్వీ యాదవ్ అనే మహిళా జర్నలిస్టులను పోలీసులు అరెస్ట్ చేశారు . అయితే దర్శనం వెంకటయ్య అరెస్టుపై ఇంకా క్లారిటీ రావాల్సి ఉంది.