ఈ 3 సూత్రాలు పాటిస్తే జీవితం ఇక స్వర్గమే..!
మనం చనిపోయాక స్వర్గానికి వెళ్తాము అని చాలా మంది చెబుతుంటారు.. అయితే అది నిజమో కాదో కానీ ఈ మూడు సూత్రలను పాటిస్తే జీవితం స్వర్గంగా మారుతుంది అని థైరోకేర్ టెక్నాలజీస్ వ్యవస్థాపకుడు, ధనవంతుడు డా.వేలుమణి..
ఆయన మాట్లాడుతూ “”అస్తవ్యస్తమైన ఆలోచనలు లేని మెదడు, జీవితంలో భయం లేని గుండె, ఈఎంఐ లేని జీవనం.. ఈ మూడు ఉంటే జీవితం స్వర్గంలా మారుతుందని వేలుమణి అన్నారు.
ఇప్పటివరకు తన జీవితంలో ఎన్నడూ ఈఎంఐ కట్టలేదన్నారు. నిరుపేద కుటుంబంలో పుట్టిన ఆయన ప్రస్తుతం రూ.5000కోట్ల నికర ఆస్తితో సంపన్న వ్యాపారవేత్తగా ఉన్నారు.