కవితకు బెయిల్ రావడానికి కారణాలు ఇవే..?
ఢిల్లీ లిక్కర్ స్కాంలో అరెస్ట్ అయిన ఐదారు నెలలుగా తీహార్ జైల్లో ఉన్న బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితకు సుప్రీం కోర్టు బెయిల్ మంజూరు చేసింది. జస్టీస్ బీఆర్ గవాయ్,జస్టీస్ విశ్వనాథ్ నేతృత్వంలోని సుప్రీం ధర్మాసనం దాదాపు గంటన్నరపాటు విచారణ చేయగా ఎమ్మెల్సీ కవిత తరపున సీనియర్ కౌన్సిల్ ముకుల్ రోహిత్గీ ,ఈడీ తరపున ఎస్వీ రాజు వాదనలు విన్పించారు.
అయితే కవితకు బెయిల్ మంజూరు చేయడానికి మూడు కారణాలను తెలిపింది. అందులో ఒకటి లిక్కర్ స్కాం లో విచారణ చేసి తుది చార్జ్ షీట్ ను దాఖలు చేయడం.. ఈడీ కేసు విచారణను పూర్తి చేయడం. మహిళగా పరిగణించి ఎమ్మెల్సీ కవితకు పది లక్షల పూచికత్తుతో బెయిల్ మంజూరు చేసినట్లు జస్టీస్ బీఆర్ గవాయ్, జస్టీస్ విశ్వనాథ్ నేతృత్వంలోని ధర్మాసనం ఆదేశాలను జారీ చేసింది. అయితే సాక్షులను ఎలాంటి పరిస్థితుల్లో ప్రభావితం చేయకూడదని ఆదేశించింది.
కవిత ఈరోజు సాయంత్రం లోపు తీహర్ జైలు నుండి విడుదల కానున్నారు. ధర్మాసనం తీర్పు కాపీని ఇవాళ్నే కవిత తరపు న్యాయవాదులు జైలు అధికారులకు అందించనున్నారు. కవితకు ఘనస్వాగతం పలికేందుకు మాజీ మంత్రులు తన్నీరు హారీష్ రావు,కేటీ రామారావు నేతృత్వంలోని బీఆర్ఎస్ శ్రేణులు సిద్ధమవుతున్నారు.