కవిత కు విధించిన బెయిల్ షరతులు ఇవే..?
ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో ఈడీ,సీబీఐ నమోదు చేసిన కేసుల్లో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితకు దేశ అత్యున్నత న్యాయ స్థానం సుప్రీం కోర్టు బెయిల్ మంజూరు చేసిన సంగతి తెల్సిందే. జస్టీస్ బీఆర్ గవాయ్, జస్టీస్ విశ్వనాథ్ నేతృత్వంలోని ధర్మాసనం కవిత బెయిల్ పిటిషన్ పై విచారణ చేసింది. కవిత తరపున సీనియర్ కౌన్సిల్ ముకుల్ రోహిత్గీ, ఈడీ తరపున ఎస్వీ రాజు వాదనలు విన్పించారు.
అయితే కవితకు బెయిల్ మంజూరులో సీబీఐ తుది ఛార్జ్ షీట్ ను దాఖలు చేయడం.. ఈడీ కేసును విచారించడం పూర్తి చేయడం.. మహిళగా పరిగణించి ఎమ్మెల్సీ కవితకు బెయిల్ మంజూరు చేస్తున్నట్లు ధర్మాసనం పేర్కొన్నది.
అయితే బెయిల్ మంజూరుకు కొన్ని షరతులను ధర్మాసనం విధించింది. అందులో భాగంగా పది లక్షల విలువైన రెండు ష్యూరీటీలను సమర్పించాలి. పాస్ పోర్టును కోర్టుకు అందజేయడం.. విచారణ సమయంలో దర్యాప్తు సంస్థలకు సహాకరించడం.. సాక్షులను ఎలాంటి ప్రభావాలకు గురి చేయకండి అని ఆదేశాలను జారీ చేసింది.