అప్పుడలా..?.. ఇప్పుడిలా..?.. జనసేనానిని కార్నర్ చేస్తున్నారా..?

 అప్పుడలా..?.. ఇప్పుడిలా..?.. జనసేనానిని కార్నర్ చేస్తున్నారా..?

Pawan Kalyan Deputy CM Of Ap

ఏపీ సార్వత్రిక ఎన్నికల సమయంలో ఇటు వైపు జనసేనాని పవన్ కళ్యాణ్.. అటు టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు ఎన్నికల ప్రచారంలో ఎక్కడ ఎప్పుడు ఏ సభలో మాట్లాడిన ఒకటే మాట.. కూటమి తరపున నేను మాట ఇస్తున్నాను.. హామీస్తున్నాను . నేరవేర్చే బాధ్యత నాది.. మాది అని ఒకటే ఊకదంపుడు ప్రచారం.. ఒక్కముక్కలో చెప్పాలంటే కూటమి అధికారంలోకి రావడానికి బాబుతో పాటు జనసేనాని పాత్రనే ఎక్కువగా ఉందని రాజకీయ విశ్లేషకులు విశ్లేషణ.. జనాల మద్ధతు కూడా అలానే ఉంది. ఎక్కడ ఏ ప్రకటన చేసిన.. యాడ్ ఇచ్చిన కానీ కూటమి పార్టీ సింబల్స్.. పవన్ బాబుల ఫోటో లేనిది అది పబ్లిష్ కాలేదు.

కానీ నేటితో వందరోజులను పూర్తి చేసుకున్న కూటమి ప్రభుత్వం మీడియాకు ప్రకటనలు ఇచ్చింది.. ఆ ప్రకటనలో ఒక్క చోట చంద్రబాబు ఫోటో ఉంది కానీ జనసేనాని ఫోటో లేదు.. కోట్ లో చంద్రబాబు పేరు ఉంది.. కానీ పవన్ పేరు ఎక్కడ లేకుండా జాగ్రత్తపడినట్లు తెలుస్తుంది. ఆ కోట్ లో ” ఇక మీదట కూడా ప్రజల ఆకాంక్షలకు,అవసరాలకు అనుగుణంగా కూటమి ప్రభుత్వం పని చేస్తుందని చంద్రబాబు గారు హామీ ఇస్తున్నారు” అని శుభం కార్డు వేశారు. ఎన్నికల ప్రచారంలోనేమో కూటమి పార్టీ హామీలను నెరవేర్చే బాధ్యత తమదంటూ ఓ సారి.. పవన్ కళ్యాణ్ గారు తీసుకుంటారని మరోసారి చెప్పిన బాబు తాజాగా ఆ ప్రకటనలో కనీసం పేరు కూడా లేకపోవడం రాజకీయ వర్గాల్లో సర్వత్రా చర్చాంశనీయమైంది.

క్రమక్రమంగా పవన్ కళ్యాణ్ ను కార్నర్ చేస్తున్నారా..?. ఎన్నికల ప్రచారంలో పవన్ పేరు.. ఫోటోను వాడుకున్న తాజాగా అధికారంలోకి వచ్చాక పక్కకు పెడుతున్నారా..?. బీజేపీ అప్పుడే ఎన్నికల హమీలకు మాకు సంబంధం లేదని తేల్చి చెప్పింది. దీంతో వారి ఫోటో కానీ పేరు కానీ లేకపోతే ఎవరూ పెద్దగా పట్టించుకునేవారు కాదు. కానీ పవన్ ఫోటో కానీ పేరు కానీ లేకపోవడంతో పవన్ మ్యానియాను తగ్గించే ప్రయత్నంలో భాగంగానే ఈ చర్యలున్నాయని రాజకీయ వర్గాల్లో గుసగుసలు విన్పిస్తున్నాయి..

వరద బాధితుల సహాయార్దం కూడా పవన్ ను కలవడం కంటే ముఖ్యమంత్రి బాబు, మంత్రి లోకేశ్ ను కలవడం ఇలాంటి ఆలోచనలను బలం చేకూరుతుందని కూడా వారి వాదన.. టీడీపీకి చెందిన నేతలు.. ఎమ్మెల్యేలు.. మంత్రులు ఏ చిన్న కార్యక్రమం చేసిన హైలెట్ చేసే మీడియా జనసేనానితో పాటు జనసేన నేతలు చేసే పెద్ద పెద్ద కార్యక్రమాలకు సైతం పీఆర్ ఇవ్వడం లేదని జనసైనికుల అభిప్రాయం.. బాబు కేరీర్ లో ఎవర్ని ఎప్పుడు ఎక్కడ వాడుకోవాలో.. ఎవరికి ఎప్పుడు పీఆర్ ఇవ్వాలో తెల్సినవాడు.. ఈ మాత్రం ఆర్ధం చేస్కోరా అని రాజకీయ విశ్లేషకులు సూచిస్తున్నారు.. అయితే బాబుకు కష్టకాలంలో అండగా ఉన్న జనసేనాని అంతత్వరగా పక్కకు పెట్టరు.. కార్నర్ కూడా చేయరని మరో వాదన.. కాలమే నిర్ణయించాలి మరి ఏది నిజమో.. ?ఏది అబద్ధమో..?

Related post

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *