బీఆర్ఎస్ నేత ఆర్ఎస్ ప్రవీణ్ ఇంట్లో దొంగతనం
బీఆర్ఎస్ కు చెందిన యువనేత.. ఇటీవల నాగర్ కర్నూల్ పార్లమెంట్ నియోజకవర్గం నుండి ఆ పార్టీ ఎంపీ అభ్యర్థిగా బరిలోకి దిగిన రిటైర్డ్ ఐపీఎస్ అధికారి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఇంట్లో దొంగలు పడ్డారు. గత సార్వత్రిక ఎన్నికల సమయంలో ఆర్ఎస్పీ కోమురంభీమ్ జిల్లా కాగజ్ నగర్ మండలం కోసిని గ్రామంలో ఓ ఇల్లును కొనుగోలు చేసిన సంగతి తెల్సిందే.
అప్పుడు ఎన్నికల సమయంలో అక్కడే ఉన్నారు. ఆ తర్వాత బీఆర్ఎస్ లో చేరిన ఆర్ఎస్పీ ఎప్పుడు అటువైపు వెళ్లిన అక్కడే ఉండేవారు. ఆయన తర్వాత అయనకు సంబంధించిన అనుచరులు అందులో ఉండేవారు.
గత రాత్రి ఆ ఇంట్లో ఎవరూ లేని సమయం చూసి కొంతమంది అగంతకులు దొంగతనానికి పాల్పడ్దారు. ఆ ఇంట్లో ఉన్న బీరువా తాళాలు పగులకొట్టి కొన్ని కీలక పత్రాలను తీసుకెళ్లినట్లు పోలీసుల ప్రాధమిక విచారణలో తేలింది. ఆ ఇంటి చుట్టూ సీసీ కెమెరాలుండటంతో పోలీసులు ఆకోణంలో విచారణ చేపడుతున్నారు.