అలిగిన టీడీపీ ఎంపీ.. ఇంత ఘోరమా..?
టీడీపీకి చెందిన ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డికి ఘోర అవమానం ఎదురైంది. నెల్లూరు జిల్లాలో ఈరోజు ఆదివారం జిల్లాకు చెందిన అధికార పార్టీల కూటమి నాయకుల.. కార్యకర్తల సమన్వయ సమావేశం జిల్లా పార్టీ కార్యాలయంలో ఘనంగా జరిగింది.
ఈ కార్యక్రమానికి మంత్రులు ఆనం రామ నారాయణ రెడ్డి, పొంగూరు నారాయణ, మహమ్మద్ ఫరూక్, ఎమ్మెల్యే… ఎమ్మెల్సీలు తదితరులు పాల్గొన్నారు. ఈ సమావేశానికి హాజరైన వారందరికీ వేదికపైకి పిలిచి పూలబొక్కెలతో ఘనస్వాగతం పలికారు.
కానీ ఎంపీ అయిన వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డికి మాత్రం పూలబొక్కె ఇవ్వడం మరిచిపోయారు. దీంతో అవమానంగా భావించిన వేమిరెడ్డి గౌరవం లేని చోట తాను ఉండనంటూ ఆ సమావేశ వేదికపై నుంచి దిగి వెళ్లిపోవడంతో అవాక్కవ్వడం అందరి వంతైంది.