SLBC ఘటన పూర్తిగా ప్రభుత్వ వైపల్యం..!

 SLBC ఘటన పూర్తిగా ప్రభుత్వ వైపల్యం..!

Loading

SLBC ఘటన పూర్తిగా ప్రభుత్వ వైఫల్యం కారణంగానే జరిగింది..కేంద్ర ప్రభుత్వానికి చెందిన అనేక శాఖల అనుమతులు, నిపుణులు సలహాలు తీసుకుని చేయాల్సిన పనులు ఆదరాబాదరగా చేసింది.ముందు షిప్ట్ చేసిన కార్మికులు టన్నెల్ లోపల మట్టిపల్లెలు కూలుతున్నాయి.. కార్మికుల ప్రాణాలకు ప్రమాదం ఉందని చెప్పినా సోయి లేకుండా ప్రభుత్వం నిర్లక్ష్యం చేసింది.

ప్రమాదం జరిగి ఇన్ని రోజులు అవుతున్నా కొంచం కూడా పురోగతి లేదు. ఏమన్నా అంటే మా మంత్రులు అక్కడే ఉన్నారు అంటూ చిల్లర మాటలు మాట్లాడుతున్నారు . ముఖ్యమంత్రి పదవిలో ఉన్న వ్యక్తి  రేవంత్ రెడ్డి తనకు ముఖ్యమంత్రి నన్న సోయి లేకుండా మాట్లాడుతున్నాడు.

పది రోజుల తర్వాత SLBC దగ్గరికి పోయి కార్మికులను బయటకు తీయకుండా, కేసీఆర్ గురించి చిల్లర మాటలు మాట్లాడుతున్నాడు.. ఇక్కడే వీళ్ళ చేతగానితనం కనిపిస్తుంది అని మాజీ మంత్రి, ఎమ్మెల్యే జగదీష్ రెడ్డి ఫైర్ అయ్యారు..

Related post

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *