సీఎం రాకతో సంగారెడ్డి జిల్లా రూపురేఖలు మారాలి

Damodar Raja Narasimha Minister for Science and Technology of Telangana
సింగిడిన్యూస్, సంగారెడ్డి: ఈనెల 23వ తారీఖున జహీరాబాద్ లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పర్యటనపై కలెక్టరేట్ లోని సమావేశం మందిరంలో మంత్రి దామోదర్ రాజనర్సింహ, జహీరాబాద్ ఎంపీ సురేష్ షెట్కర్, నారాయణఖేడ్ ఎమ్మెల్యే సంజీవరెడ్డి, జిల్లా కలెక్టర్ క్రాంతి వల్లూరు, ఎస్పీ పరితోష్ పంకజ్, అదనపు కలెక్టర్ చంద్రశేఖర్, సమీక్ష సమావేశం ఏర్పాటు చేశారు. జిల్లా అధికారులతో సమావేశం ఏర్పాటు చేశారు.
ఈ సందర్భంగా మంత్రి దామోదర్ రాజనర్సింహ మాట్లాడుతూ ఈ నెల 23వ తారీకున సంగారెడ్డి జిల్లాలోని జహీరాబాద్ నియోజకవర్గం లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పర్యటన తెలంగాణ రాష్ట్రంలో చారిత్రాత్మకం కావాలన్నారు. సీఎం రేవంత్ రెడ్డి పర్యటనతో సంగారెడ్డి జిల్లా అభివృద్ధిలో రూపురేఖలు మారుతాయన్నారు. అన్ని శాఖల అధికారుల సమన్వయంతో సీఎం పర్యటన విజయవంతం చేయాలని అధికారులను ఆదేశించారు. అధికారులు సీఎం పర్యటన కోసం రూట్ మ్యాప్ ప్రణాళిక, సెక్యూరిటీ ,బందోబస్తు, బారికేడ్లు , ట్రాఫిక్ నియంత్రణ, త్రాగునీరు,హెలిప్యాడ్ , హెల్త్ క్యాంప్ లు పకడ్బందీగా ఏర్పాటు చేయాలన్నారు.
ముఖ్యమంత్రి పర్యటనలో బసవేశ్వర విగ్రహావిష్కరణ, కేంద్రీయ విద్యాలయ నూతన భవనం ప్రారంభోత్సవం, మహిళా పెట్రోల్ బంకు, జిల్లా అభివృద్ధికి కావలసిన కొన్ని కార్యక్రమాలను శంకుస్థాపనలు చేసి, వివిధ అభివృద్ధి సంక్షేమ పథకాల పై ఏర్పాటు చేసిన స్టాల్ లను పరిశీలించి సభ లో పాల్గొంటారని తెలిపారు.