గవర్నర్ ప్రసంగం గాంధీ భవన్ ప్రెస్మీట్ లెక్క ఉంది..!

KTR’s call to the people of Hyderabad..!
తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల్లో గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ చేసిన ప్రసంగం అంతా గాంధీభవన్ నుండి తయారైన వడ్డకం లా ఉంది.
ఆయన ప్రసంగం అంతా గాంధీభవన్ లో కాంగ్రెస్ నేతల ప్రసంగంలా ఉంది అని మాజీ మంత్రి… బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు.
అసెంబ్లీ వాయిదా పడిన అనంతరం మీడియా సమావేశంలో మాజీ మంత్రి కేటీఆర్ మాట్లాడుతూ రైతుబంధు అందరికి అందిందని గవర్నర్ చేత అబద్ధాలు చెప్పించారు. రైతుభరోసా ఎవరికి అందలేదు. మహిళలకు రెండున్నర వేలు ఇవ్వలేదు. ఆసరా నాలుగు వేలు ఇవ్వలేదు. అన్ని అబద్ధాలు మాట్లాడారు అని ఆయన అన్నారు.