20లక్షల ఉద్యోగాల కల్పనే లక్ష్యం..!

TDP is a party of Telugu women..!
ఏపీలో రాబోయే ఐదేండ్లలో యువతకు 20 లక్షల ఉద్యోగాల కల్పన తమ ప్రభుత్వ లక్ష్యమని టీడీపీ అధినేత.. సీఎం నారా చంద్రబాబు నాయుడు అసెంబ్లీలో వెల్లడించారు.
రూ.6.50 లక్షల కోట్ల పెట్టుబడులకు ఎంఓయూ పూర్తి చేశాము.. వీటి ద్వారా 5 లక్షల ఉద్యోగ అవకాశాలు లభిస్తాయని చంద్రబాబు నాయుడు అన్నారు.
అటు నిరుద్యోగులకు నెలకు రూ.3,000 భృతి త్వరలోనే అందిస్తామన్నారు. తాము అధికారంలోకి రాగానే 203 అన్న క్యాంటీన్ల ద్వారా పేదలకు అన్నం పెడుతున్నామని చంద్రబాబు అన్నారు. రాష్ట్ర ప్రజలంతా గర్వపడేలా రాజధానిని నిర్మిస్తామని బాబు ఉద్ఘాటించారు.