రేవంత్ రెడ్డికి షాకిచ్చిన కాబోయే మంత్రి..!

Work like a human being, not like a real estate broker..!
ఇంకా ఆయన మంత్రే కాలేదు. అప్పుడే ముఖ్యమంత్రి అనుముల రేవంత్ రెడ్డికి షాకిచ్చారు ఆయన. ఇంతకూ ఎవరాయన అని ఆలొచిస్తున్నారా..?. ఇంకా ఎవరు అనుకుంటున్నారు. హోం మంత్రి కావాలని కలలు కంటున్న మునుగోడు అసెంబ్లీ నియోజకవర్గ కాంగ్రెస్ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి.
ఉమ్మడి నల్గోండ జిల్లాలో హుజుర్ నగర్ అసెంబ్లీ నియోజకవర్గ కేంద్రంలో ఉగాది పండుగ రోజున అర్హులైన పేదలకు రేషన్ కార్డుల ద్వారా సన్నబియ్యం పంపిణీ కార్యక్రమాన్ని సీఎం రేవంత్ రెడ్డి ప్రారంభించిన సంగతి తెల్సిందే. మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి నేతృత్వంలో జరిగిన ఈ కార్యక్రమానికి ఉమ్మడి జిల్లాకు చెందిన ఎమ్మెల్యేలు.. ఎమ్మెల్సీలు.. ఎంపీలు అఖరికి రాజగోపాల్ రెడ్డి సోదరుడు కోమటిరెడ్డి వెంకటరెడ్డి సైతం హాజరయ్యారు.
కానీ రాజగోపాల్ రెడ్డి మాత్రం హజరు కాలేదు. ఈ నెల మూడో తారీఖున మంత్రివర్గ విస్తరణ ఉన్న నేపథ్యంలో కోమటిరెడ్డి ఇంట్లో మంత్రి పదవిస్తే తన ఇంట్లో కూడా మంత్రి పదవి ఇవ్వాలని ఉత్తమ్ పట్టుబట్టి కూర్చున్నాడు. ఇప్పటికే క్యాబినెట్ బెర్త్ ఖరారు కావడంతో ఈ సభకు వెళ్లి అగ్గి రాజేయడం ఎందుకని హాజరు కాలేదంట రాజగోపాల్ రెడ్డి.