స్టేషన్ ఘన్ పూర్ లో రేవంత్ రెడ్డి సాక్షిగా బయటపడిన విబేధాలు..!

ముఖ్యమంత్రి అనుముల రేవంత్ రెడ్డి స్టేషన్ ఘన్ పూర్ నియోజకవర్గ పర్యటనలో భాగంగా స్థానిక ఎమ్మెల్యే కడియం శ్రీహారి.. నియోజకవర్గ ఇంచార్జ్ ఇందిర వర్గాల మధ్య ఉన్న విబేధాలు మరోసారి బయటపడ్డాయి. సీఎం రేవంత్ రెడ్డి పర్యటన సందర్భంగా ఏర్పాటు చేసిన ప్లేక్సీల్లో సైతం ఇంచార్జ్ అయిన ఇందిర ఫోటోలు లేకుండా కడియం వర్గం ఏర్పాటు చేయడంతో ఈ విబేధాలు తారాస్థాయికి చేరాయి. అంతేకాకుండా నియోజక వర్గ ఇన్చార్జి, మహిళా నాయకురాలు లేకుండానే రేవంత్ రెడ్డి స్టేషన్ ఘనపూర్ సభ నిర్వహించారు. అసలు కనీసం ఎమ్మెల్యే కడియం శ్రీహరి నుండి కూడా ఆహ్వానం రాలేదట .
కడియం శ్రీహరి కూతురు కూతురు భవిష్యత్ కోసమే నియోజకవర్గ ఒరిజినల్ కాంగ్రెస్ ఇంచార్జీ ఇందిరాను కావాలనే పక్కన పెడుతున్నారు అని ఆరోపిస్తున్నరు కార్యకర్తలు.కొత్త ఇంచార్జీ మీనాక్షి నటరాజన్ పాత వారికే మొదటి ప్రాధాన్యత అని చెప్పినా, స్టేషన్ ఘనపూర్ నియోజకవర్గంలో పరిస్థితి వేరేలా ఉంది.రేవంత్ రెడ్డి ముందే సభలో జై ఇందిరా..అనే నినాదాలతో మారు మోగేలా ఒరిజినల్ కాంగ్రెస్ కార్యకర్తలు నినాదాలు చేశారు.
అయితే ఒరిజినల్ కార్యకర్తలంతా కడియం శ్రీహరి మీద మీనాక్షి నటరాజన్ కు ఫిర్యాదు చేద్దాం అని, గాంధీ భవన్ కు బయలుదేరగానే ముఖ్య నేతలు ఫోన్ చేసి ఆపేసినట్టు సమాచారం.ఉప ఎన్నికలు వచ్చినప్పుడు ఒరిజినల్ కాంగ్రెస్ సత్తా ఏంటో చూపిస్తాం, కడియంను ఓడిస్తాం అని సవాల్ చేస్తున్నరు ఒరిజినల్ కాంగ్రెస్ కార్యకర్తలు.
