లగచర్లలో 40లక్షల భూమిని 10లక్షలకే లాక్కుంటున్న కాంగ్రెస్ సర్కారు..?
ముఖ్యమంత్రి అనుముల రేవంత్ రెడ్డికి కండ్లు నెత్తికెక్కాయా…?. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఒకలా..?. అధికారంలో ఉన్నప్పుడు ఒకలా ఉంటున్నారా..?. అంటే అవుననే అంటున్నారు బీజేపీకి చెందిన మల్కాజిగిరి ఎంపీ.. మాజీ మంత్రి ఈటల రాజేందర్. గురువారం హైదరాబాద్ లోని బీజేపీ పార్టీ కార్యాలయంలో రాజేందర్ మీడియాతో మాట్లాడుతూ ” ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి కండ్లు నెత్తికెక్కాయి అంటూ లగచర్ల రైతుల విషయంలో ముఖ్యమంత్రి తీరుపై ఆయన మండిపడ్డారు.
ప్రతిపక్షంలో ఉన్నప్పుడు భూసేకరణకు వచ్చే అధికారులను తన్ని తరమండి అని పిలుపునిచ్చిన రేవంత్ రెడ్డి ఇప్పుడు అదే అధికారులతో ప్రజల నుండి.. రైతుల దగ్గర నుండి భూములను బలవంతంగా లాక్కుకుంటున్నారు.
లగచర్ల పరిసర ప్రాంతాల్లో రైతుల నుండి.. ప్రజల నుండి కొంతమంది దళారులు, మధ్యవర్తులు ఆసైన్డ్ భూములను పొందినవారిని బెదిరింపులకు పాల్పడుతున్నారు అని ఆరోపించారు. నలబై లక్షల విలువ చేసే భూములను ఐదు లక్షలకో.. పది లక్షలకో గుంజుకునే ప్రయత్నం చేస్తున్నారు. స్థానిక ప్రజలు తిరగబడితే అక్రమ కేసులు పెట్టి జైల్లో వేస్తున్నారు అని ఆరోపించారు.