అల్లు అర్జున్ పై పెట్టిన కేసులివే..!
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ను ఈరోజు శుక్రవారం చిక్కడపల్లి పోలీసులు ఆయన నివాసంలో అరెస్ట్ చేసిన సంగతి తెల్సిందే. ఇటీవల విడుదలైన పుష్ప 2 ప్రీమియర్ షో సందర్భంగా సంధ్య థియేటర్ దగ్గర నెలకొన్న తొక్కిసలాటలో ఓ మహిళ మృతి చెందటంతో పాటు ఓ బాలుడు తీవ్రంగా గాయపడ్డాడు.
ఈ ఘటనలో ఇప్పటికే ఆ థియేటర్ యజమాన్యం మేనేజర్ ను అరెస్ట్ చేసిన పోలీసులు తాజాగా హీరో అల్లు అర్జున్ ను అరెస్ట్ చేశారు. ఈ క్రమంలో అల్లు అర్జున్ పై బీఎన్ఎస్ (105) సెక్షన్ కింద నాన్ బెయిల్ బుల్ కేసు నమోదు చేశారు.
దీంతో ఐదు నుండి పది సంవత్సరాల శిక్ష పడుతుంది. అలాగే బీఎన్ఎస్ 118(1)కింద ఏడాది నుండి పదేళ్ళు జైలు శిక్ష పడే అవకాశం ఉంది. ప్రస్తుతం అల్లు అర్జున్ ను గాంధీ ఆసుపత్రికి పరీక్షల నిమిత్తం తరలించారు.