ఎమ్మెల్సీ కవిత పోరాట ఫలితమే బీసీ రిజర్వేషన్ల బిల్లు..!

The BC Reservation Bill is the result of MLC Kavitha’s struggle..!
తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు, బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత గారి పోరాట ఫలితంగానే బీసీలకు రాజకీయ, విద్య, ఉద్యోగ రంగాల్లో రిజర్వేషన్లు పెంచడానికి రెండు వేరువేరు బిల్లులను పెట్టిందని జాగృతి నాయకులు రంగు నవీన్ ఆచారి స్పష్టం చేశారు. బీసీల కోసం ఎమ్మెల్సీ కవిత చేసిన ఉద్యమానికి ప్రభుత్వం తలొగ్గిందని, అందుకు ఎమ్మెల్సీ కవితకు ధన్యవాదాలు తెలియజేశారు. ఇది తెలంగాణ జాగృతి సాధించిన మరో భారీ విజయంగా అభివర్ణించారు.
సుదీర్ఘకాలంగా ఈ దేశంలో అన్ని రకాల అన్యాయాలకు గురైన బీసీ సోదరులకు రిజర్వేషన్ల కోసం విద్యా, ఉపాధి, రాజకీయ రిజర్వేషన్ల కోసం రాష్ట్ర ప్రభుత్వం రెండు వేర్వేరు బిల్లులను ప్రవేశ పెట్టడం స్వాగతిస్తున్నామని తెలిపారు. విద్యా ఉపాధి రాజకీయ రిజర్వేషన్లకు కలిపి ఒకే బిల్లు పెడితే బీసీలకు అన్యాయం జరుగుతుంది అని ముందే గుర్తించి వేరువేరు బిల్లులు పెట్టాల్సిందే అని డిమాండ్ చేసినది కేవలం జాగృతి అధ్యక్షురాలు ఎమ్మెల్సీ కవిత మాత్రమే అని గుర్తు చేశారు.
మండల్ కమిషన్ రిపోర్టును తొక్కి పెట్టింది మొదలు కులగణన డెడికేటెడ్ కమిషన్ కాకుండా రెగ్యులర్ కమిషన్కు ఇచ్చేవరకు కాంగ్రెస్ ది ద్రోహ చరిత్ర అని అన్నారు. బీసీల సంఖ్య తక్కువగా చూపెట్టినప్పటికీ బీసీ సంఘాల మరియు తెలంగాణ జాగృతి వంటి సంస్థల ఒత్తిడి ఉద్యమంతోనే బీసీ రిజర్వేషన్లు కొలిక్కి వచ్చాయని అన్నారు. బీసీల కోసం బీసీలు మాత్రమే మాట్లాడాలనే కొందరి వాదన బీసీల గొంతును బలహీనపరచాలనే కుట్ర మాత్రమే అని ఆయన అన్నారు.
బాధితుల పక్షాన అణగారిన వర్గాల పక్షాన ఎవరు గొంతు ఎత్తినా స్వాగతించాల్సిన అవసరం ఉందని నొక్కి చెప్పారు. సంపూర్ణంగా 42% బీసీ రిజర్వేషన్లు అమలయ్యే వరకు బీసీలు జాగ్రత్తతో ఉండాల్సిన అవసరం ఉందని తెలిపారు. బిల్లులు పాస్ అవుతున్న ఈ కీలక దశలో కేంద్రం మీద ఒత్తిడి పెంచేందుకు బీసీలు సిద్ధంగా ఉండాలని పిలుపునిచ్చారు.మరో నాయకుడు అనంతుల ప్రశాంత్ మాట్లాడుతూ…. బీసీ రిజర్వేషన్ల కోసం రెండు వేరువేరు బిల్లులు పెట్టడం ఎమ్మెల్సీ కవిత సాధించిన విజయమని అన్నారు.
తెలంగాణ జాగృతి చేసిన సుదీర్ఘ పోరాటంతోనే ఇది సాధ్యమైందని ప్రశాంత్ తెలిపారు. బిల్లు ప్రవేశపెట్టి చేతులు దులుపుకోకుండా కేంద్రం మీద ఒత్తిడి తెచ్చి రిజర్వేషన్లు సంపూర్ణంగా అమలయ్యే వరకు రాష్ట్ర ప్రభుత్వం బాధ్యత వహించాలని ఆయన పేర్కొన్నారు.
రిజర్వేషన్లు సంపూర్ణంగా అమలయ్యే వరకు బిసి సోదరుల పక్షాన జాగృతి ఉద్యమం కొనసాగుతుందని ఆనంతుల ప్రశాంత్ స్పష్టం చేశారు.ఈ పాత్రికేయ సమావేశం లో మేడ్చల్ జిల్లా అధ్యక్షులు ఈగ సంతోష్, రంగారెడ్డి జిల్లా అధ్యక్షులు అర్చన సేనాపతి, జాగృతి ఇటలీ అధ్యక్షులు కిషోర్ యాదవ్ సీనియర్ నాయకులు లింగం, దండెం ఆనంద్, లలిత యాదవ్, లావణ్య, స్వప్న, ఆర్కొల్ల రాజు, తేజ చౌదరి, బొల్లంపల్లి సందీప్, విష్ణు, వికాస్, శ్రీరామ్, తదితరులు పాల్గొన్నారు.
s
