అందుకే కాంగ్రెస్ లో చేరాను
తెలంగాణ రాష్ట్ర ప్రధాన ప్రతిపక్ష బీఆర్ఎస్ కు చెందిన ఎమ్మెల్యే..మాజీ మంత్రి పోచారం శ్రీనివాస్ రెడ్డి,అతని తనయుడు పొచారం భాస్కర్ రెడ్డి సీఎం రేవంత్ రెడ్డి సమక్షంలో కాంగ్రెస్ లో చేరిన సంగతి తెల్సిందే..
అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ “”కాంగ్రెస్ పార్టీతోనే నా రాజకీయ ప్రస్థానం ప్రారంభమైంది. మళ్లీ చివరగా రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీలో చేరాను.
నా జీవితంలో రాజకీయంగా ఆశించేది ఏం లేదు. టీఆర్ఎస్ కంటే ముందు టీడీపీలో ఉన్నాను. ఆనాడు ఉన్న పరిస్థితులను బట్టి టీఆర్ఎస్లో చేరాను. కాంగ్రెస్ పార్టీతోనే నా రాజకీయ ప్రస్థానం ప్రారంభమైంది. మళ్లీ చివరగా రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీలో చేరాను.
రేవంత్ చేస్తున్న కార్యక్రమాలు నచ్చి వారి నాయకత్వాన్ని బలపరచాలని కాంగ్రెస్ పార్టీలో చేరాను. రైతుల సంక్షేమాన్ని మాత్రమే నేను కోరుకుంటున్నాను. సీఎం రేవంత్‌ను భగవంతుడు ఆశీర్వదించాలని ప్రార్థిస్తున్నాను అని అన్నారు..