కేసీఆర్ తో అట్లుంటది మరి…!

That’s what happens with KCR…!
కేసీఆర్ … అనే వ్యక్తిని రాజకీయంగా ఎవరైన విమర్శించవచ్చు. కానీ పద్నాలుగేండ్ల తెలంగాణ ఉద్యమంలో.. పదేండ్ల పాలనలో ఆయనని మెచ్చుకున్నవాళ్ళే తప్పా తిట్టినవాళ్ళు లేరు ఒక్క ఆయనంటే గిట్టనివాళ్ళు తప్పా.
తాజాగా తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల్లో మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ పై కాంగ్రెస్ పార్టీకి చెందిన సీనియర్ నేత.. ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ప్రశంసల వర్షం కురిపించారు. సభలో దేవాలయాలపై జరిగిన చర్చలో ఆయన మాట్లాడుతూ “యాదగిరిగుట్ట కట్టాలన్న ఆలోచన రావడం, భగవంతుడు కేసీఆర్‌కు కల్పించడం అభినందనీయం.
యాదగిరిగుట్ట శ్రీలక్ష్మి నరసింహ స్వామి వారి ఆలయం కట్టినందుకు కేసీఆర్ గారిని మనస్పూర్తిగా అభినందిస్తున్నాను అని ఆయన అన్నారు. ఈ వీడియోను బీఆర్ఎస్ నెటిజన్లు.. కేసీఆర్ అభిమానులు సోషల్ మీడియాలో అట్లుంటది కేసీఆర్ తో మరి అంటూ పోస్టులు పెడుతున్నారు. మీరు ఓ లుక్ వేయండి..
