నాగబాబు కిచ్చే మంత్రిత్వ శాఖ ఇదే..!
ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నాయకత్వంలోని ఏపీ మంత్రివర్గంలో చేరబోతున్న నాగబాబుకు ఏ శాఖ ఇస్తారనేది ఆసక్తిగా మారింది.
ఆయనకు సినిమాటోగ్రఫీ శాఖ ఇస్తారనే ప్రచారం జరుగుతోంది. సొంత పార్టీ కావడంతో టూరిజంతోపాటు కందుల దుర్గేశ్ వద్ద ఉన్న ఈ శాఖ బదిలీ సులభం అవుతుందనే ఆలోచన చేస్తున్నట్లు సమాచారం.
నాగబాబు సినిమాటోగ్రఫీ మంత్రి అయితే ఇటు ఇండస్ట్రీ, అటు ప్రభుత్వం మధ్య వారధిగా ఉంటారని అధిష్ఠానం భావిస్తున్నట్లు తెలుస్తోంది. గనుల శాఖ ఇస్తారనే ప్రచారమూ ప్రస్తుతం ఏపీ పాలిటిక్స్ లో ఉంది.