ఆ మంత్రి అంతే ….అదో టైపు…!

That minister is just that…that type…!
ఆయనది ప్రభుత్వంలో రెండో స్థానం.. కేసీఆర్ పై కోపంతో పార్టీ మారి కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడానికి ధన బలం .. అంగబలం ఉపయోగించాడు. అనుకున్నట్లుగానే అధికారంలోకి వచ్చారు. వచ్చాక తీరా అధికారంలోకి రావడానికి కారణమైన ప్రజలను దూరం పెట్టాడు ఆయన. ఇంతకూ ఎవరూ ఆయన అని ఆలోచిస్తున్నారా..?. ఎవరో కాదు ఖమ్మం జిల్లాలోని పాలేరు అసెంబ్లీ నియోజకవర్గం నుండి గత ఎన్నికల్లో కాంగ్రెస్ తరపున గెలుపొందిన ప్రస్తుత రెవిన్యూ అండ్ ఐఎన్పీఆర్ శాఖ మంత్రి వర్యులు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి.
మంత్రి కాకముందు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ఉమ్మడి ఖమ్మం జిల్లాలో ఏ మారుమూల గ్రామంలో ఏ ఫంక్షన్ జరిగిన అక్కడకెళ్ళేవాడు. వాళ్ల కష్టసుఖాల్లో తోడుండేవాడు. అండగా ఉంటానని హామీచ్చేవాడు. తీరా మంత్రి అయ్యాక ఆయన రూటే సఫరేట్ అన్నట్లు మారింది మంత్రి తీరు అని ఆయన అనుచరులు.. ఖమ్మం ప్రజలు గుసగుసలాడుకుంటున్నారు. తమకు ఏదైన సమస్య ఉంటే చెప్పుకుందామని వెళ్లిన కానీ కలవడం లేదని వాపోతున్నారు.
ఏమైన కష్టముంటే తన పీఏలకు.. మంత్రి కార్యాలయం ఇంచార్జులకు చెప్పండి అని అసలు అపాయింట్మెంటే ఇవ్వడం లేదని వాళ్ళు తమ ఆవేదనను వ్యక్తం చేస్తున్నారని ఖమ్మం లో టాక్. మంత్రి కార్యాలయంలో కలవరు.. ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో కలవరు. అఖరికి సచివాలయానికెళ్ళిన చిక్కరు అని అంటున్నారు.
ఎంపీ కాకముందు ఉన్న శ్రీనన్న ఎంపీ అయినాక మారలేదు. అఖరికీ బీఆర్ఎస్ అధికారంలో ఉన్న సమయంలో కూడా అందర్ని కల్సి తమ సాదక బాధలను తీర్చిన శీనన్న ఇప్పుడు మంత్రి అయ్యాక తమకు అందకుండా పోయాడు. ఆ అమంత్రి అంతే అదో టైపు అని వారు తమ ఆవేదనను వ్యక్తం చేస్తున్నారంట. ఇప్పటికైన సదరు మంత్రి తన తీరు మార్చుకుంటారో లేదో చూడాలి మరి..!
