ఎమ్మెల్సీ కవిత బలం అదే…?

BRS MLC KAVITHA
సింగిడిన్యూస్, వెబ్ డెస్క్ : బీఆర్ఎస్ నుంచి సస్పెన్షన్ గురైన ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత దారేటు..?. బీఆర్ఎస్ నుంచి సస్పెండ్ అయిన ఎమ్మెల్సీ కవిత బీజేపీలో చేరతారని కొన్ని మీడియా సంస్థలు ప్రచారం చేస్తున్నాయి. లేదు కవిత అధికార కాంగ్రెస్ పార్టీలో చేరతారని మరికొన్ని మీడియా సంస్థలు ప్రచారం చేస్తున్నాయి. ఇవేమి కాదు కవిత సరికొత్త పార్టీ పెడుతుంది అని ఇంకొన్ని మీడియా సంస్థలు ప్రచారం చేస్తున్నాయి.
జాగృతి కార్యకర్తలు, నేతలు అయితే లేదు తమ అధినేత్రి పార్టీ పెడతారు. తెలంగాణ బహుజన రాష్ట్ర సమితి అనే పార్టీ పెడతారు. ఇప్పటికే టీఆర్ఎస్ అనే పేరుతో పార్టీ రిజిస్ట్రేషన్ కూడా అయింది అని వారు చెబుతున్నారు. ఎవరెన్ని ఊహాగానాలు చేసిన రేపు బుధవారం మధ్యాహ్నాం ఎమ్మెల్సీ కవిత నిర్వహించబోయే మీడియా సమావేశంతో క్లారిటీ రానున్నది ఆమె రాజకీయ భవిష్యత్తు గురించి. ఒకవేళ కల్వకుంట్ల కవిత సరికొత్త పార్టీ పెడితే తెలుగు రాష్ట్రాల్లోనే నాలుగో మహిళ అవుతుంది.
ఇంతకుముందు దివంగత మాజీ సీఎం ఎన్టీఆర్ సతీమణి నందమూరి లక్ష్మీ పార్వతి అప్పట్లో ఎన్టీఆర్ తెలుగుదేశం పార్టీని స్థాపించారు. ఆ తర్వాత తెలంగాణ ఉద్యమ కొనసాగుతున్న వేళ ప్రస్తుత అధికార కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్సీ విజయశాంతి తల్లి తెలంగాణ అనే పేరుతో పార్టీని స్థాపించారు. ఇటీవల ప్రస్తుత ఏపీపీసీసీ చీఫ్ , మాజీ సీఎం వైఎస్ జగన్ సోదరి, దివంగత మాజీ సీఎం వైఎస్సార్ తనయ వైఎస్ షర్మిల వైఎస్సార్ తెలంగాణ పార్టీను స్థాపించి ఆ తర్వాత ఏపీ పాలిటిక్స్ లోకి ఎంట్రీచ్చారు.
ఇప్పుడు ఒకవేళ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత తెలంగాణ బహుజన రాష్ట్ర సమితి పేరు మీదుగా పార్టీ పెడితే అటు ఏపీ ఇటు తెలంగాణ రెండు తెలుగు రాష్ట్రాల్లో సొంత పార్టీ పెట్టబోతున్న నాలుగో మహిళ అవుతారు. వీరికి కవితకు మధ్య తేడా ఏంటంటే ఎమ్మెల్సీ కవితకు చక్కని ఆకట్టుకునే వాగ్ధాటి.. విషయాన్ని పిన్ పాయింట్ గా చెప్పగలగడం.. ఉద్యమ నేపథ్యం, ఎంపీగా, ఎమ్మెల్సీగా పని చేయడమే కాకుండా జాగృతి పేరుతో ఎంతో కొంత తనకంటూ కొద్ది క్యాడర్ ను నిర్మించుకోవడం తనకు బలంగా మారనున్నది.
మరోవైపు ధన బలం కూడా ఉండటంతో రాజకీయాల్లో వారికంటే మెరుగ్గా రాణించగలరేమో అని రాజకీయ విశ్లేషకులు వ్యాఖ్యానిస్తున్నారు. అయితే ప్రస్తుత తెలంగాణలో బీఆర్ఎస్ , కాంగ్రెస్, బీజేపీ లాంటి బలమైన పార్టీలు ఉన్న తరుణంలో తాను మిగతా ఆ ముగ్గురిలెక్క చరిత్రలో మిగలనున్నారా లేదా తమిళనాడు దివంగత మాజీ సీఎం జయలలిత లెక్క చరిత్రకెక్కనున్నారా అనేది కాలమే సమాధానం చెబుతుంది.