దసరా పండుగకు టీజీఆర్టీసీ కానుక

TGSRTC
తెలంగాణ రాష్ట్ర ఆర్టీసీ సంస్థ దసరా కానుకగా ప్రయాణికులకు ఓ శుభవార్తను తెలియజేసింది. మరో రెండు మూడు రోజుల్లో దసరా పండుగ రానున్న నేపథ్యంలో హైదరాబాద్ నుండి వెళ్లే బస్సులతో పాటు రాష్ట్ర వ్యాప్తంగా బస్సుల సంఖ్యను పెంచుతున్నట్లు సంస్థ ఎండీ వీసీ సజ్జనార్ తెలిపారు.
దసరా,బతుకమ్మ పండుగలను దృష్టిలో పెట్టుకుని సొంతూళ్ళకు వెళ్లే ప్రయాణికులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా మొత్తం 6,304బస్సులను నడుపుతున్నట్లు ఆయన పేర్కొన్నారు.అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభు గత ఏడాదితో పోలిస్తే అదనంగా ఆరు వందల బస్సులను ఏర్పాటు చేసినట్లు ఆయన తెలిపారు..
ఈ నెల తొమ్మిదో తారీఖు నుండి పన్నెండో తారీఖు వరకు ఈ సర్వీసులన్నీ ప్రయాణికులకు అందుబాటులో ఉండనున్నట్లు ట్విట్టర్ లో పోస్టు చేశారు.
