కారులో పరీక్షలు..ఆసుపత్రిలో అబార్షన్..!

 కారులో పరీక్షలు..ఆసుపత్రిలో అబార్షన్..!

Tests in the car..Abortion in the hospital..!

Loading

ఖమ్మంలో సంచలన ఘటన చోటు చేసుకుంది.కారులో లిగనిర్థారణ పరిక్షలు,ఆడపిల్ల అని తేలితే ఆసుపత్రిలో అబార్షన్ లు..గుట్టు చప్పుడుకాకుండా అమాయకు పేదలే లక్ష్యంగా చేస్తున్న దందా బయటపడింది. వివరాల్లోకెలితే ఖమ్మం నగర పరిధిలోని అల్లీపురానికి చెందిన కాత్యాయిని ఒక ప్రైవేటు ఆసుపత్రిలో ల్యాబ్ టెక్నీషియన్ గా పనిచేసేది, ఆమె పని చేసే ఆసుపత్రికి చారి, మనోజ్ అనే ఇద్దరు ఆర్ఎంపీలు రోగులను పంపేవారు దీంతో వీరి ముగ్గురికి పరిచయం ఏర్పడింది..

అక్రమ సంపాదనకు ఆశ పడిన ఈ ముగ్గురు ఒక కారులో అల్ట్రాసౌండ్ స్కాన్ పరికరం ఏర్పాటు చేసుకొని పేద మహిళలను టార్గెట్ చేస్తూ కారులోనే లింగ నిర్ధారణ పరీక్షలు చేయడం మొదలుపెట్టారు..ఒక వేళ గర్భంలో ఉన్నది బాలిక అని తేలితే పక్కనే ఉన్న ప్రైవేట్ ఆసుపత్రికి పంపి అబార్షన్ చేయించి పైసలు వసూలు చేస్తున్నారు.

నిందితులపై కఠిన చర్యలు తీసుకోవాలని బాదితులు కోరుతున్నారు..ఈ వార్త రాష్ట్ర వ్యాప్తంగా చర్చానీయాంశంగా మారింది.మహిళా దినోత్సవం సమీపిస్తున్న వెళ ఆడపిల్లలను కడుపులోనే తుంచేస్తున్న ఇలాంటి వాళ్ళను వదిలిపెట్టకూడదని మహిళ సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి.

Related post

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *