మెల్ బోర్న్ లో గర్జించిన తెలుగోడు..!
మెల్‌బోర్న్‌లో ఆసీస్ తో జరుగుతున్న బాక్సింగ్ డే టెస్ట్ లో తొలి ఇన్నింగ్స్ లో యువబ్యాటర్ నితీశ్ కుమార్ రెడ్డి అద్భుతం సృష్టించాడు. ఎనిమిదో స్థానంలో బ్యాటింగ్‌కు వచ్చి కష్టాల్లో ఉన్న టీమిండియాను ఆదుకున్నాడు. ఒకవైపు సీనియర్లంతా నిరాశపర్చినా ఆసీస్ బౌలర్లను ఆడుకున్నాడు. ఒక సిక్స్, 9 ఫోర్లతో సెంచరీతో కదం తొక్కాడు.
బ్యాట్స్ మెన్ లో ఆల్‌రౌండర్లు జడేజా, సుందర్ సహకారంతో జట్టు స్కోరును 350 దాటించాడు. 99 రన్స్ వద్ద ఫోర్ కొట్టి టెస్టుల్లో ఘనంగా తొలి సెంచరీ నమోదు చేశాడు. ఎనిమిదో స్థానంలో అత్యధిక పరుగులు చేసిన బ్యాట్స్‌మెన్ నిలిచాడు.
ఇంతకుముందు అనిల్ కుంబ్లే ఈ ఘనత సాధించాడు.ఇక వాషింగ్టన్ సుందర్ 50 పరుగులు చేసిన కాసేపటికే వెనుతిరిగాడు. నితీశ్‌తో కలిసి ఎనిమిదో వికెట్‌కు 127 పరుగుల భాగస్వామ్యం నిర్మించాడు. నాథన్ లియాన్ బౌలింగ్‌లో స్లిప్‌లో క్యాచ్ ఇచ్చి 8వ వికెట్‌గా ఔటయ్యాడు. ప్రస్తుతం సిరాజ్ (2), నితీశ్ (105) క్రీజులో ఉన్నారు. 9 వికెట్ల నష్టానికి 358 రన్స్ చేసింది. తొలి ఇన్నింగ్స్‌లో మరో 116 రన్స్ చేయాల్సి ఉంది.