మహిళలకు తెలంగాణ ప్రభుత్వం శుభవార్త

Telangana government is good news for women
తెలంగాణ రాష్ట్రంలోని మహిళలకు ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి నాయకత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వం శుభవార్తను తెలిపింది..
అందులో భాగంగా రాష్ట్రంలో ఉన్న మహిళలకు ఇరవై వేల కోట్ల రూపాయలను వడ్డీ లేని రుణాలుగా ఇవ్వాలని నిర్ణయించినట్లు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మల్లు తెలిపారు. శనివారం ఖమ్మం జిల్లా ముదిగొండ మండలం కమలాపురం లో ఆయన పర్యటించారు.
మధిర నియోజకవర్గంలో త్వరలోనే ఇంటిగ్రేటెడ్ స్కూల్ పనులకు శంకుస్థాపన చేస్తాము.. అంగన్ వాడిలో మూడో తరగతి వరకు ఏర్పటు చేసి నాలుగో తరగతికి ఇంటిగ్రేటెడ్ రెసిడెన్సియల్ కు విద్యార్థులను పంపేలా ఏర్పాట్లు చేస్తామని ఉపముఖ్యమంత్రి భట్టి తెలిపారు…
