రైతాంగానికి తెలంగాణ ప్రభుత్వం శుభవార్త..!

Telangana government is good news for farmers..!
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వం రాష్ట్రంలోని రైతులకు శుభవార్త చెప్పింది. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న దాదాపు 3 ఎకరాల వరకు సాగులో ఉన్న భూములకు ఎకరానికి రూ.6వేల చొప్పున రైతు భరోసా నిధులు జమ చేసినట్లు ప్రభుత్వం తెలిపింది.
అయితే రైతు భరోసా డబ్బులు జమ పథకం కింద జనవరి 26 నుండి రైతుల ఖాతాల్లో ప్రభుత్వం నిధుల జమను ప్రారంభించింది.
ఫిబ్రవరి 5న 17.03 లక్షల మందికి రైతు భరోసా పైసలు జమ చేసింది. తాజాగా ఫిబ్రవరి 10న 8.65 లక్షల మందికి విడతల వారీగా నిధులు జమ చేసిన సంగతి తెలిసిందే.
