విద్యార్థులకు తెలంగాణ ప్రభుత్వం శుభవార్త

Telangana Government good news for students
తెలంగాణ రాష్ట్రంలోని స్కూళ్లకు చెందిన విద్యార్థులకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్తను తెలిపింది. నిన్న శుక్రవారం అసెంబ్లీ సమావేశాల్లో భాగంగా మండలిలో డిప్యూటీ సీఎం .. ఆర్థిక శాఖ మంత్రి భట్టి విక్రమార్క మల్లు మాట్లాడుతూ ” అన్ని పాఠశాలల్లో ప్రతిరోజూ గంటపాటు క్రీడల పీరియడ్ ఉండేలా విద్యాశాఖకు ఆదేశాలిస్తామని ” ఆయన ప్రకటించారు.
భట్టి ఇంకా మాట్లాడుతూ ” గ్రామాల్లోని క్రీడాప్రాంగణాలను వినియోగంలోకి తెచ్చి ఆగస్టు 15,జనవరి 26న అన్ని ప్రభుత్వ పాఠశాలల్లో ఆటలపోటీలను నిర్వహిస్తాము..
తమ ప్రభుత్వం క్రీడలకు అధిక ప్రాధాన్యత ఇస్తాము.. నిత్యం గంట స్పోర్ట్స్ పీరియడ్ పెట్టాలని ఎమ్మెల్సీలు నా దృష్టికి తీసుకురావడంతో ఈ నిర్ణయం తీసుకున్నాము”అని ఆయన అన్నారు.
