తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం..!
తెలంగాణ రాష్ట్ర గీతమైన ‘జయజయహే తెలంగాణ’, తెలంగాణ తల్లి ఫొటోను పాఠ్యపుస్తకాల్లో ముద్రించాలని ముఖ్యమంత్రి అనుముల రేవంత్ రెడ్డి నాయకత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వం నిర్ణయించింది.
ఈ నిర్ణయంలో భాగంగా వచ్చే ఏడాది ఒకటో తరగతి నుంచి పదో తరగతి పాఠ్య పుస్తకాల్లో ఇవి కనిపించనున్నాయి. ప్రస్తుత పుస్తకాల్లో ప్రతిజ్ఞతోపాటు జాతీయ గీతం, జాతీయ గేయం ఉన్నాయి.
ఇక వచ్చే ఏడాదీ విద్యార్థులకు పాత సిలబస్సే ఉంటుంది.. 2026-27లో సిలబస్ మారే అవకాశం ఉందని కూడా స్కూల్ ఎడ్యుకేషన్ డైరెక్టర్ నర్సింహారెడ్డి తెలిపారు.