మంత్రివర్గ విస్తరణకు ముహూర్తం ఖరారు.

సింగిడిన్యూస్, వెబ్ డెస్క్ : తెలంగాణ రాష్ట్ర మంత్రివర్గ విస్తరణకు కాంగ్రెస్ పార్టీ జాతీయ నాయకత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఇందులో భాగంగా మరో ముగ్గురికి చోటు దక్కింది. రేపు ఆదివారం మధ్యాహ్నాం మూడున్నర గంటలకు రాజ్ భవన్ లో నూతనంగా మరో ముగ్గురు మంత్రులు ప్రమాణ స్వీకారం చేయనున్నారు.
రాజ్ భవన్ లో గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ వారితో ప్రమాణ స్వీకారం చేయించనున్నారు. అయితే, మంత్రివర్గ విస్తరణలో చోటు దక్కించుకున్న ముగ్గురి పేర్లు బయటకు వచ్చాయి.
ఎస్సీ సామాజిక వర్గంలో మాల వర్గానికి చెందిన చెన్నూరు అసెంబ్లీ నియోజకవర్గ ఎమ్మెల్యే గడ్డం వివేక్ వెంకట స్వామి, మాదిగ సామాజిక వర్గానికి చెందిన మానకొండూరు ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణ, ముదిరాజ్ సామాజిక వర్గానికి చెందిన మక్తల్ ఎమ్మెల్యే వాకిటి శ్రీహరికి అవకాశం దక్కినట్లు వార్తలు గుప్పుమంటున్నాయి.