టీమిండియా రికార్డులే రికార్డులు..!
కాన్పూర్ వేదికగా బంగ్లాదేశ్ జట్టుతో జరుగుతున్న రెండో టెస్ట్ మ్యాచ్ లో టీమిండియా రికార్డులే రికార్డులను సృష్టిస్తుంది. మొదటి ఇన్నింగ్స్ లో బ్యాటింగ్ కు దిగిన టీమిండియా అత్యంత వేగంగా తొలి యాబై పరుగులు.. వంద పరుగులు.. నూట యాబై పరుగులు.. రెండోందల పరుగులు.. రెండోందల యాబై పరుగులను చేసింది.
తొలి మూడు ఓవర్లలోనే యాబై పరుగులను దాటించిన ఏకైక జట్టుగా టీమిండియా నిలిచింది. కనీసం రెండోందల బంతులను ఆడిన ఇన్నింగ్స్ లలో అత్యధిక రన్ రేట్ (8.22)ను భారత్ నమోదు చేసింది.
పురుషుల క్రికెట్ లో అత్యంత వేగవంతమైన యాబై పరుగులకంటే ఎక్కువ భాగస్వామ్యం (రోహిత్ -జైశ్వాల్ ) ఇరవై మూడు బంతుల్లో యాబై ఐదు పరుగులు రికార్డు. టెస్ట్ లో ఒకే ఏడాదిలో అత్యధిక సిక్సులు తొంబై ఆరు.