డిప్యూటీ సీఎం పవన్ కి షాకిచ్చిన టీడీపీ
డిప్యూటీ సీఎం.. జనసేనాని పవన్ కళ్యాణ్ తిరుమల తిరుపతి పర్యటన సాక్షిగా టీడీపీ జనసేనల మధ్య ఉన్న విబేధాలు మళ్ళోక్కసారి బయటపడినట్లు తెలుస్తుంది. తిరుమలకు వస్తాను.. అక్కడ భారీ బహిరంగ సభ ఏర్పాటు చేస్తానను రెండు రోజులకు ముందే జనసేనాని ప్రకటించాడు. అయిన కానీ తిరుపతి నియోజకవర్గ టీడీపీ శ్రేణులు తమకు సంబంధం లేదన్నట్లే అంటిముట్టని విధంగా ఉన్నారు.
మొన్న సోమవారం సాయంత్రం తిరుమలకు చేరుకున్న పవన్ కళ్యాణ్ కు స్థానిక జనసేన ఎమ్మెల్యే అరణి శ్రీనివాసుల నేతృత్వంలో జనసైనికులు తప్పా స్థానిక టీడీపీ క్యాడర్ కానీ ఇటీవల జరిగిన ఎన్నికల్లో టికెట్ ఆశించి భంగపడ్డ ఆ పార్టీ మాజీ ఎమ్మెల్యేలు.. ఎమ్మెల్యే అభ్యర్థులు సైతం స్వాగతం పలకడానికి ముందుకు రాకపోవడం గమనార్హం.
సభ ఏర్పాట్లు రెండు రోజుల నుండి జరుగుతున్న కానీ అటువైపు కన్నెత్తి చూడలేదు పసుపు దళం.. జనసేన నాయకులైన సరే వాళ్లను ఆహ్వానించకపోవడం.. ప్రాధాన్యత ఇవ్వకపోవడం తిరుపతిలో మొదటి నుండి విబేధాలకు మళ్ళీ ఆజ్యం పోసినట్లైంది.
గతంలో వైసీపీలో ఉండి జనసేనలో చేరిన ఆరణి శ్రీనివాసులకు పవన్ కళ్యాణ్ టికెట్ ఇవ్వడంతో అప్పటి నుండి ఇరుపక్షాల మధ్య పచ్చ గడ్డి వస్తే భగ్గుమనే పరిస్థితి ఏర్పడింది. తాజా పర్యటనతో అది ఇంకా తీవ్రతమైంది.దీంతో టీడీపీతో సఖ్యత లేకపోవడంతో తిరుపతి సభ ఫెయిల్యూర్ అవుతుందా…?. సక్సెస్ అవుతుందా అనే సంద్గిగ్ధంలో ఉన్నారు జనసేనాని.