రోడ్లపైకి వచ్చి టీడీపీ శ్రేణులు నిరసనలు

 రోడ్లపైకి వచ్చి  టీడీపీ శ్రేణులు నిరసనలు

TDP worker’s suicide – a lesson for political parties..!

Loading

అధికార కూటమి ప్రభుత్వంలో ప్రధానమైన టీడీపీకి చెందిన శ్రేణులు ఏకంగా రోడ్లపైకి వచ్చి నిరసనలు తెలిపిన సంఘటన ఒకటి తాజాగా వెలుగులోకి వచ్చింది. కాకినాడ సిటీ నగరంలో స్థానిక ఎంపీ తరపువారు భానుగుడి పద్మప్రియ థియేటర్‌ ఎదురుగా ఖాళీస్థలంలోను బాణాసంచా దుకాణం ఏర్పాటు చేశారు.

మరోవైపు స్థానిక సిటీ ఎమ్మెల్యే తరపువారు మెయిన్‌రోడ్‌లో చిన్నపాటి స్థలంలో బాణసంచా దుకాణం ఏర్పాటు చేశారు. అయితే వీటి అనుమతులను అధికారులు రద్దు చేయడంతో పెద్ద దుమారమే రేగింది. దీంతో మొన్న సోమవారం మధ్యాహ్నం నుంచి నిన్న మంగళవారం రాత్రి వరకు ఆర్డీవో కార్యాలయం వద్ద టీడీపీ నగర అధ్యక్షుడు మ ల్లిపూడి వీరు, పెద్దసంఖ్యలో టీడీపీ శ్రేణులు రోడ్డు మీద పడుకుని నిరసన తెలిపారు.

దీంతో అధికారులు మెయిన్‌రోడ్‌లోనే కౌస్తుభా హోటల్‌ సమీపాన ఖాళీస్థలంలో బాణసంచా దుకాణం ఏర్పాటు చేసు కునేందుకు సిటీ ఎమ్మెల్యే తరపు వాళ్లకి అనుమతిచ్చారు. ఇక మెక్లారిన్‌ హైస్కూల్‌ గ్రౌండ్‌, బోటు క్లబ్‌ స్థలంలో ఎంపీ తరపువాళ్లు దుకాణాలు ఏర్పాటుచేశారు.

Related post

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *