ఆ ఒక్క సంతకంతో టీడీపీ ఎమ్మెల్యే పై అనర్హత వేటు..?
ఒక్కొక్కసారి అత్యుత్సాహాం పనికి రాదంటారు పెద్దలు..ఈ మాట ఏపీ అధికార టీడీపీకి చెందిన చిత్తూరు జిల్లా జీడీ నెల్లూరు అసెంబ్లీ నియోజకవర్గానికి దళిత ఎమ్మెల్యే డా.వీఎం థామస్ విషయంలో సరిగ్గా సూటైంది. ఇటీవల ముఖ్యమంత్రి.. టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు తిరుమల తిరుపతి శ్రీవారికి పట్టువస్త్రాలను సమర్పించిన సంగతి తెల్సిందే. ఆ రోజు ఎమ్మెల్యే వీఎం థామస్ సైతం కొండపైకెళ్లి స్వామివారిని దర్శించుకోవాలి..
తిరుమల నియమనిబంధనల ప్రకారం అన్యమతస్తులు తాము వెంకన్నస్వామిపై భక్తి.. నమ్మకం ఉందని డిక్లరేషన్ ఇవ్వాల్సి ఉంటుంది. ఇదే నియమంతోనే ఇటీవల మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహాన్ రెడ్డి తిరుపతి పర్యటన రద్ధైంది. తాజాగా ఎమ్మెల్యే వీఎం థామస్ ఎస్సీ రిజర్వర్డ్ నియోజకవర్గమైన జీడీ నెల్లూరు నుండి బరిలోకి దిగి గెలుపొందాడు. తాజాగా తిరుమలలో ఇచ్చిన డిక్లరేషన్ తో తాను క్రైస్తవుడ్ని అని సాంకేతికంగా చెప్పినట్లైంది. దీంతో కన్వర్టర్డ్ క్రిస్టియన్ బీసీ సామాజిక వర్గానికి చెందినవాడవుతాడు.
అలాంటప్పుడు ఎస్సీ నియోజకవర్గంలో ఎలా పోటి చేస్తాడని ఇటు అసెంబ్లీ స్పీకర్ కు అటు కేంద్ర ఎన్నికల కమీషన్ కు వైసీపీ శ్రేణులు పిర్యాదు చేయడానికి సిద్ధమవుతున్నారు.ఒకవేళ రాష్ట్ర ప్రభుత్వం నుండి స్పందన రాకపోతే సీఈసీ సుప్రీ కోర్టులో ఈ అంశంపై కొట్లాడి సదరు ఎమ్మెల్యేపై అనర్హత వేటు వేయించాలని ఉవ్విరుళ్లుతుంది వైసీపీ.. చూడాలి మరి సాంకేతికంగా బీసీ అని ఒప్పుకున్న థామస్ పై అనర్హత వేటు పడుతుందో..?. లేదో ..? మరి..!