ఆదర్శంగా నిలిచిన TDP MLA
ఏపీలోని మిగతా ప్రజాప్రతినిధులందరికీ ఆదర్శంగా నిలిచారు టీడీపీకి చెందిన ఓ ఎమ్మెల్యే.. రాష్ట్రంలోని శింగనమల ఎమ్మెల్యే బండారు శ్రావణి తనను అభినందించడానికో..లేదా కలవడానికో వచ్చేవార్కి ఓ విజ్ఞప్తి చేశారు.
ఇందులో భాగంగా ‘నన్ను అభినందించేందుకు వస్తోన్న కార్యకర్తలు బొకేలు, పూలదండలు, శాలువాలు తీసుకొస్తున్నారు.
వాటికి బదులు విద్యార్థులకు ఉపయోగపడే నోట్ బుక్స్, పెన్నులు, ఇతర సామాగ్రి తీసుకురావాలి’ అని ఫ్లెక్సీ ఏర్పాటు చేశారు. ఎమ్మెల్యేలందరూ ఇది పాటిస్తే బాగుంటుందని నెటిజన్లు సూచిస్తున్నారు. అంతకుముందే జనసేనాని పవన్ కళ్యాణ్ ఇదేవిధంగా చేయాలని పిలుపునిచ్చారు