72గంటల్లో కొండా సురేఖ రాజీనామా చేయాలి

 72గంటల్లో కొండా సురేఖ రాజీనామా చేయాలి

Konda Surekha Minister Of Telangana

Loading

తెలుగు సినిమా ఇండస్ట్రీకి చెందిన సీనియర్ హీరోయిన్ సమంతపై వివాదస్పద వ్యాఖ్యలు చేసిన మంత్రి కొండా సురేఖపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. సినీ రాజకీయ అన్ని రంగాలకు చెందిన ప్రముఖుల దగ్గర నుండి సామాన్యుల వరకు అందరూ తమ నిరసనగళం విన్పిస్తున్నాయి.. సోషల్ మీడియా వేదికగా మంత్రిగా కొండా సురేఖ రాజీనామా చేయాలని యాష్ ట్యాగ్స్ ను ట్రెండ్ చేస్తున్నారు.

ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ మాట్లాడుతూ ” సమంతపై వివాదస్పద వ్యాఖ్యలు చేసిన కొండా సురేఖ డెబ్బై రెండూ గంటల్లో తన మంత్రి పదవికి.. ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. ఎవరైన నడిరోడ్డుపై హత్య చేసి తప్పైంది.. సారీ చెబితే సరిపొద్దు.. పిచ్చిపిచ్చి వాగుడు వాగి ఏదో నోరు జారాను అంటే సరిపోతుంది.

ఇదే సంఘటన అమెరికాలో జరిగితే అదే నడిరోడ్డుపై మర్డర్ చేస్తే ఎనిమిది వేల కోట్ల రూపాయల పైన్ వేస్తారు.. సమంతతో పాటు మహిళలందర్ని అవమానించేలా మాట్లాడిన కొండాసురేఖ పై చర్యలు తీసుకోవాలి. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి.. రాహుల్ గాంధీకి మహిళలపై చిత్తశుద్ధి ఉంటే వెంటనే కొండా సురేఖను మంత్రి పదవి నుండి.. పార్టీ నుండి తప్పించాలని ఆయన డిమాండ్ చేశారు.

Related post

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *