Big Breaking -HCU భూములపై సుప్రీంకోర్టు సంచలన తీర్పు..!

తెలంగాణ రాష్ట్ర రాజకీయాలను షేక్ చేస్తున్న వివాదస్పద హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ భూముల వ్యవహారంలో దేశ అత్యున్నత న్యాయ స్థానమైన సుప్రీం కోర్టు సంచలన తీర్పునిచ్చింది. హెచ్ సీయూ కంచ గచ్చిబౌలి భూముల వివాదంపై సుప్రీంకోర్టులో ఈరోజు విచారణ జరిగింది.
ఈ విచారణలో ప్రభుత్వం విక్రయించాలని తలపెట్టిన భూములను ఈరోజు మధ్యాహ్నాం మూడున్నరకు వెళ్లి సందర్శించాలి. అక్కడి వాస్తవ పరిస్థుతులపై నివేదికను తయారు చేసి అందించాలని హైకోర్టు రిజిస్ట్రార్ ను సుప్రీం కోర్టు ఆదేశించిన సంగతి తెల్సిందే.
ఈరోజు మూడున్నరకు హెచ్ సీయూ కెళ్లిన తెలంగాణ హైకోర్టు రిజిస్ట్రార్ అక్కడ పరిస్థితులపై ఆరా తీసి నివేదికను సుప్రీంకోర్టుకి నివేదించారు. నివేదికను పరిశీలించిన సుప్రీంకోర్టు కంచ గచ్చిబౌలి భూముల్లో ఉన్న చెట్లను నరకవద్దు అని ఆదేశించింది.
తదుపరి ఆదేశాలు జారీ చేసేవరకూ అక్కడ ఎలాంటి మొక్కలను నకరవద్దు. ఎలాంటి కార్యక్రమాలను చేపట్టోద్దని ప్రభుత్వాన్ని ఆదేశించింది. ఇది చాలా సీరియస్ విషయం. చట్టాన్ని ఎలా మీరు మీ చేతుల్లోకి తీసుకుంటారు అని సీఎస్ పై అగ్రహాం వ్యక్తం చేసింది.
