స్టార్ క్రికెటర్ రిటైర్మెంట్

 స్టార్ క్రికెటర్ రిటైర్మెంట్

ఇంగ్లాండ్ జట్టుకు చెందిన సీనియర్ స్టార్ ఆటగాడు.. ఆల్ రౌండర్ మొయిన్ అలీ అంతర్జాతీయ క్రికెట్ నుండి విరమణ ప్రకటించారు. నేను దేశం తరపున ఎన్నో ఏండ్లు క్రికెట్ ఆడాను. యువకులకు అవకాశం ఇవ్వాలనే లక్ష్యంతో ఈ నిర్ణయం తీసుకున్నాను.

నేను ఆట నుండి తప్పుకుంటేనే యువకులకు అవకాశం వస్తుంది. ఇప్పటికే నేను చాలా క్రికెట్ ఆడాను.. ప్రతి రోజు దేశం కోసం ఆడాలనే నేను మైదానంలోకి దిగుతాను “అని ఓ ఇంటర్వూలో మొయిన్ అలీ పేర్కొన్నారు. అయితే ఇప్పటికే అలీ రెండు సార్లు క్రికెట్ కు గుడ్ బై చెప్పారు.

తన నిర్ణయాన్ని ఆ రెండు సార్లు వెనక్కి తీసుకున్నారు. ఇకపై అలాంటి పని చేయను అని ఆయన స్పష్టం చేశారు. ఇంగ్లాండ్ తరపున అలీ 68 టెస్టులు, 138 వన్డే మ్యాచులు,92T20లు ఆడారు. లీగ్ లో 352మ్యాచ్ లాడిన మొయిన్ అలీ ఎన్నో సార్లు ఒంటి చెత్తో ఇంగ్లాండ్ జట్టును విజయతీరాలకు చేర్చాడు.

Related post

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *