సభలో కోవ లక్ష్మీకి మైకు ఇవ్వని స్పీకర్
తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల్లో భాగంగా సుప్రీం కోర్టు ఎస్సీ ఎస్టీ వర్గీకరణకు మద్ధతుగా తీర్పునిచ్చిన నేపథ్యలో చర్చ కార్యక్రమం జరిగింది.ఈ చర్చలో బీఆర్ఎస్ ఎమ్మెల్యే.. ఆదివాసీ బిడ్డ అయిన కోవ లక్ష్మీకి స్పీకర్ మైకు ఇవ్వలేదని మాజీ మంత్రి పటోళ్ళ సబితా ఇంద్రారెడ్డి అన్నారు.
తెలంగాణ భవన్ లో జరిగిన మీడియా సమావేశంలో మాజీ మంత్రి సబితా ఇంద్రారెడ్డి మాట్లాడుతూ” రిజర్వేషన్ల వర్గీకరణ గురించి సభలో చర్చ జరుగుతున్న క్రమంలో ఎన్నో పోరాటాలు ఉద్యమాలు చేసిన బీఆర్ఎస్ ఎమ్మెల్యే కోవ లక్ష్మీకి స్పీకర్ మైకు ఇవ్వలేదు అని ఆరోపించారు.
సభలో సబితా ఇంద్రారెడ్డికి మైకు ఇవ్వకూడదని తీర్మానం చేసినప్పుడు ఒక్క నిమిషం మాట్లాడ్తా అని దాదాపు నాలుగు గంటల పాటు సభలో నిలబడిన కోవ లక్ష్మీకి ఎందుకు మైకు ఇవ్వలేదు.. ఇది మహిళలను అవమానించడం కాదా.. “అని ఆమె ప్రశ్నించారు.